Tollywood : కొత్త సినిమా ప్రమోషన్స్ షూరు.. దళపతి సీన్ రీక్రియేట్ చేసిన అనిల్ రావిపూడి.. ప్రోమో వైరల్..
విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా జనవరి 12న విడుదల. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. తాజాగా దళపతి సీన్ రీక్రియేట్ చేసింది ఈ మూవీ టీం.

2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోరుకు టాలీవుడ్ ఇప్పుడిప్పుడే సమాయత్తమవుతుండగా, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం అందరికంటే ముందే ప్రచార వేగాన్ని పెంచేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ ప్రమోషన్లను ఘనంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు, పండుగ సినిమాలన్నింటికంటే ముందుగానే మ్యూజికల్ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. అయితే సినిమా ప్రమోషన్లను వినూత్నంగా, సరదాగా ప్లాన్ చేయడంలో అనిల్ రావిపూడికి సాటిలేరని మరోసారి రుజువైంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నవంబర్ 20 నుంచి తొలి పాట సందడి మొదలుకానుంది.
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
ఈ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇవ్వడానికి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ కృతి శెట్టి కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన క్లాసిక్ చిత్రం ‘దళపతి’లోని ఓ ఐకానిక్ సీన్‌ను ఫన్నీగా రీక్రియేట్ చేశారు. ఈ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రోమో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో సరదా కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ప్రమోషనల్ రీల్స్ చేయడం, ఆయన తిట్ల మధ్య కృతి శెట్టి నవ్వుతూ రియాక్ట్ అవ్వడం ఆకట్టుకుంటున్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫన్నీ ప్లాన్ వెనుక కీర్తి సురేష్ హస్తం ఉందేమోనంటూ అభిమానులు సరదాగా స్పందిస్తుండగా, చివర్లో హీరోయిన్లు ఇద్దరూ కలిసి చిన్న స్టెప్‌తో వైబ్ తీసుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
ఓవర్సీస్ ప్రేక్షకులను నేరుగా పలకరించేందుకు చిత్ర యూనిట్ అమెరికాలో మెగా ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసింది. డిసెంబర్ 26, 27 తేదీల్లో చికాగోలో, డిసెంబర్ 29 నుంచి 31 వరకు ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి బృందం ప్రత్యేక ప్రమోషన్లు నిర్వహించనుంది. ఇటీవలే ఊటీలో 12 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసి రెండు పాటలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. “బావ బామ్మర్ది సౌజన్యంతో” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
