AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటన్నా ఇలా మారిపోయావ్! ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

రియల్ లైఫ్ లో అయినా రీల్ లైఫ్ లో అయినా ఈ హ్యాండ్సమ్ హీరో చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా ఉంటాడు. అందుకు తగ్గట్టుగానే ఎక్కువగా లవ్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ సినిమాలతోనే ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అయితే ఇప్పుడీ హీరో కూడా మాస్ బాట పట్టాడు.

Tollywood: ఏంటన్నా ఇలా మారిపోయావ్! ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Sharwanand
Basha Shek
|

Updated on: Feb 25, 2026 | 9:31 PM

Share

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడీ ప్రామిసింగ్ హీరో. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోన్న శర్వాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి ప్రాజెక్టులను పూర్తిగా కంప్లీట్ చేసే పనిలో పడ్డాడీ క్రేజీ హీరో. ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే ఓ సినిమా చేస్తున్నాడు శర్వా. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పనిలో పనిగా శర్వా ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఇందులో ఎన్నడూ చూడని విధంగా రగ్డ్ గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు శర్వానంద్. ఇప్పటివరకూ ఎక్కువగా పక్కింటి అబ్బాయి తరహా రోల్స్ తో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు పూర్తిగా ఊరమాస్ లుక్ లోకి మారిపోయాడు. ఎవరూ ఊహించని రీతిలో కోర మీసాలు, మెడలో తాయిత్తు, చేతిలో కత్తి పట్టుకోవడాన్ని చూస్తుంటే శర్వా ఈసారి ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

భోగి సినిమాలో గంగ అనే పాత్రలో కనిపించనున్నాడు శర్వా. 1960 స్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు లో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్‌ హయాతి శర్వాతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భోగి సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటుగా పలు ప్రధాన భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే భోగిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

భోగి సినిమాలో శర్వానంద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర