AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ కటిక చీకటిలో ఏం జరిగింది? ఓటీటీలో దూసుకుపోతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్

గతేడాది థియేటర్లలో విడుదలై ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ముదులుపుతోంది. సరికొత్త కథ, కథనాలు, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో డిజిటల్ స్ట్రీమింగ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరి ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

OTT Movie: ఆ కటిక చీకటిలో ఏం జరిగింది? ఓటీటీలో దూసుకుపోతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 24, 2026 | 9:40 PM

Share

గతేదాది ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. వాస్తవికతకు దగ్గరగా ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ను చూసిన నెటిజన్లు తమ పాజిటివ్ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఓ అర్ధరాత్రి ఇద్దరు పోలీసుల జీవితాలను ఎలా మార్చేసిందన్నది ఈ సినిమా కథ. ఎస్ఐ ఝాన్సీ , కానిస్టేబుల్ హరీష్ ఒక రోజు రాత్రి రొటీన్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా ఒక జర్నలిస్ట్ అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. దీంతో పోలీసుల జీవితం పూర్తిగా తలకిందులు అవుతుంది. ఇద్దరు పోలీసులు సస్పెండ్ అవుతారు. మరి ఆ హత్య కేసు దర్యాప్తులో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్న పోలీసులు దాన్నుంచి ఎలా బయటపడ్డారన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

పోలీసుల వ్యక్తిగత జీవితం, విధి నిర్వహణలో వారు పడే ఇబ్బందులు, మానసిక సంఘర్షణను చక్కగా చూపించిన సినిమా పాతి రాత్రి. అంటే తెలుగులో అర్ధరాత్రి. మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన షౌబిన్ షాహిర్, నవ్య నాయర్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సన్నీ వేన్, ఆన్ అగస్టిన్, శబరీష్ వర్మ, ఇంద్రన్స్, హరిశ్రీ అశోకన్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది. అయితే కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

జీ5లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర