AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కోతితో సరదాగా ఆడుకుంటోన్న ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

పాత్రకు తగ్గట్టుగా మారిపోవడం ఈ టాలీవుడ్ నటి స్పెషల్. కొన్ని సినిమాల్లో చీర కట్టుకుని పద్దతిగా కనిపిస్తే.. మరికొన్ని సినిమాల్లో బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్లలో నటించి మెప్పిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Tollywood: కోతితో సరదాగా ఆడుకుంటోన్న ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Feb 17, 2026 | 9:08 PM

Share

పై ఫొటోలో నెత్తి మీద కోతిని కూర్చొపెట్టుకుని సరదాగా ఆడుకుంటోన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. బోల్డ్ అండ్ రొమాంటిక్ హీరోయిన్ గా జెట్ స్పీడ్ లో దూసుకెళ్లుతోంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా పాత్ర నచ్చితే చాలు సపోర్టింగ్ రోల్స్ లోనూ నటిస్తుందీ అందాల తార. అందుకే ఈ ముద్దుగుమ్మ కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ బ్యూటీ స్పెషాలిటీ ఏంటంటే పాత్రకు తగ్గట్టుగా మారిపోవడం.. కొన్ని సినిమాల్లో చీర కట్టుకుని చాలా ట్రెడిషినల్ గా కనిపించిన ఈ హీరోయిన మరి కొన్నిమూవీస్ లో బోల్డ్ అండ్ రొమాంటిక్ రోల్స్ లోనూ నటించి మెప్పించింది. ఒక సినిమాలో అయితే ఏకంగా వేశ్య పాత్రలో నటించి డేరింగ్ బ్యూటీ గా ప్రశంసలు కూడా అందుకుంది. రవితేజ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీకి నెట్టింట కూడా మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ఫొటోలకు నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం కూడా మేమే చెబుదాం లెండి. తను మరెవరో కాదు కేరాఫ్ కంచరపాలెం హీరోయిన్ ప్రణీత పట్నాయక్.

2018లో రిలీజై సంచలన విజయం సాధించిన కేరాఫ్ కంచర పాలెం సినిమాలో భార్గవి పాత్రలో అద్భుతంగా నటించింది ప్రణీత. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దీని తర్వాత పలు సినిమాల్లో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించిందీ అందాల తార. దుల్కర్ సల్మాన్- మృణాళ్ ఠాకూర్ ల ప్రేమ కావ్యం సీతారామం సినిమాలో వేశ్య పాత్రను అద్భుతంగా పోషించి బోల్డ్ అండ్ డేరింగ్ బ్యూటీ అనిపించుకుంది. అలాగే ‘నెట్’ సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్యగా కొన్ని రొమాంటిక్ సీన్లలోనూ నటించింది.

ఇవి కూడా చదవండి

ప్రణీత పట్నాయక్ లేటెస్ట్ ఫొటోస్..

సినిమాలతో పాటు  పరువు అనే తెలుగు వెబ్ సిరీస్ లోనూ ఓ ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా గత ఏడాది బాలీవుడ్ లో విడుదలైన సన్నీ డియోల్ సినిమా జాట్ లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది ప్రణీత పట్నాయక్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
5నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో ఫుల్ ఎనర్జీ!
5నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో ఫుల్ ఎనర్జీ!
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే?
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే?
తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఇది కదా కమ్‌బ్యాక్ అంటే..!
తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఇది కదా కమ్‌బ్యాక్ అంటే..!
అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే..