AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్.. ఒంటరిగా చూడొద్దు

చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను బాగానే భయపెట్టింది. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ 9.3 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్.. ఒంటరిగా చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 17, 2026 | 7:17 PM

Share

ఎప్పటిలాగే ఈ వారంలో కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల సందడి మొదలైపోయింది. అలా మంగళవారం (ఫిబ్రవరి 17) కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అలా గతేడాది విడుదలైన ఒక తెలుగు సూపర్ హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. గతేడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైంది. చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైనా సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఊహించని ట్విస్టులతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఐఎఎమ్ డీబీలోనూ ఈ మూవీకి 9.3 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కల్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల ఆగడాలు, బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి తెలుసుకుంటారు. అతని నిజ స్వరూపం బయట పెట్టాలని అతని దగ్గరకు వెళతారు.

అయితే ఆత్మలు, దెయ్యాల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఆ సవాలును స్వీకరించిన హీరో బృందం ఒక భయంకరమైన పాడుబడిన బంగ్లాలో మూడు రోజుల పాటు నివసించడానికి వెళ్తారు. మరి ఆ పాడుబడ్డ బంగ్లాలో వారికి ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి? పుణ్యవతి అనే ఆత్మకు, గిరిజనుడైన మైమ్ మధుకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు ఆ మిత్రులు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని నమ్మరా? లేదా? అన్నప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు ఈషా.. . త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్, మైమ్ మధు ప్రధాన పాత్రలు చేశారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను భయపెట్టిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?