AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana High Court: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే

Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో షాది ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా మభ్యంతర ఉత్తర్వులు జస్టిస్ శ్రవణ్ కుమార్ జారీ చేశారు. దీనిపై తదుపరి..

Telangana High Court: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే
Telangana High Court
Subhash Goud
|

Updated on: Aug 12, 2026 | 9:28 PM

Share

Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో షాది ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా మభ్యంతర ఉత్తర్వులు జస్టిస్ శ్రవణ్ కుమార్ జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు ఈ పథకాల కింద చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మళ్లీ విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు. ఉచిత పథకాల అమలుపై న్యాయవాది విజయ గోపాల్ వేసిన పిటిషన్‌ హై కోర్టు లో పిటిషన్‌ వేయడంతో ఈ విచారణ నిర్వహించింది హైకోర్టు. అయితే న్యాయవాది విజయ్‌ గోపాల్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలో హైకోర్టు విచారణ చేపట్టింది. చట్టసభల్లో తీర్మానం చేయకుండా అందుబాటులోకి తెచ్చిన పథకాలు చెల్లవని విజయ్‌ గోపాల్‌ కోర్టులో వాదించారు. గత విచారణ సందర్భంగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, నాలుగు వారాలైనా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయలేదని విజయ్‌ గోపాల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రంగనాథ్‌కు నోటీసులు:

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మేడ్చల్‌ హౌజింగ్‌ సొసైటీ లేఔట్‌లో కూల్చివేతలపై విచారణ నిర్వహించింది. హైడ్రా చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలపై జోక్యం తగదని హైకోర్టు సూచించింది. కూల్చివేతతలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసింది.

Follow Us