AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో! ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా

'హనుమాన్' సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ రిషభ్ శెట్టి కనిపించనున్నాడు.

Jai Hanuman: 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో! ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా
Jai Hanuman Movie
Basha Shek
|

Updated on: Feb 18, 2026 | 6:52 AM

Share

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్‌లో ఉండగానే జై హనుమాన్ సినిమాను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా పోస్టర్ కూడా విడుదల చేసి ఒక్కసారిగా ఈ మూవీపైఅంచనాలు పెంచేశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. కానీ ఎందుకోకానీ చాలా రోజులుగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడీ మూవీ రెగ్యులర షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 22న హంపిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడీ క్రేజీ సీక్వెల్ లో రిషబ్ శెట్టితో పాటు ఒక టాలీవుడ్ స్టార్ నటుడు నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అతను మరెవరో కాదు ‘బాహుబలి’ భల్లాలదేవ రానా దగ్గుబాటి. రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తోన్న ఈ మూఈలో రానా ఏ పాత్రలో నటిస్తారన్నది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు. అయితే ‘జై హనుమాన్’ సినిమాలో రానా రాముడి పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరి కొన్ని నివేదికలు రానా విలన్ పాత్రలో నటిస్తారని కూడా చెబుతున్నాయి.

రానా దగ్గుబాటి ఏ పాత్రలోనైనా ఇమడగల నటుడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, సహాయక నటుడిగా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జై హనుమాన్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. గతంలో, రానా దగ్గుబాటి తన టాక్ షోలలో ఒకదాని కోసం రిషబ్ స్వస్థలం కెరాడికి వచ్చి రిషబ్ ని ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టే ఇప్పుడు ఇద్దరూ కలిసి నటిస్తున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

‘జై హనుమాన్’ చిత్రం గతంలో వచ్చిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ముహూర్తం ఫిబ్రవరి 22న హంపిలో భారీ స్థాయిలో జరగనుంది.

ఈనెల 22న హంపిలో షూటింగ్ ప్రారంభం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us