AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC Movie: రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డీసీ’.. గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ వామికా గబ్బి.. ఏం చేసిందో తెలుసా?

పాన్ ఇండియా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించిన సినిమా డీసీ. అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ మూవీలో వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

DC Movie: రూ. 50 కోట్ల క్లబ్‌లో 'డీసీ'.. గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ వామికా గబ్బి.. ఏం చేసిందో తెలుసా?
DC Movie Actress Wamiqa Gabbi
Basha Shek
|

Updated on: Aug 12, 2026 | 6:09 PM

Share

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా డీసీ. ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇందులో హీరోగా నటించడం విశేషం. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ రా అండ్ రస్టిక్ మూవీని తెరకెక్కించాడు. ఆగస్టు 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. డీసీ సినిమా మొదటి వీకెండ్‌లోనే రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడీ సినిమా టాక్ ఆప్ ది టౌన్ గా మారిపోయింది. అలాగే ఇందులో హీరోయిన్ గా నటించిన వామికా గబ్బి కూడా తెగ ట్రెండ్ అయిపోతోంది. డీసీ సినిమా సక్సెస్ నేపథ్యంలో వామికా చేసిన ఓ మంచి పని ఇప్పుడు నెటిజన్ల మనసులు గెల్చుకుంటోంది.

డీసీ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు పలువురు నటీనటులు సహాయక పాత్రలు చేశారు. అందులో జవహర్ శక్తి అనే ఓ నటుడు కూడా ఈ మూవీలో ఓ కీ రోల్ చేశాడు. సినిమా షూటింగ్ సందర్భంగా వామికాకు, జవహర్ కు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె తనకు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మొబైల్ గిఫ్ట్ ఇచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడీ సహాయక నటుడు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. తోటి నటుడి పట్ల వామికా చూపిన ప్రేమను అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ గిఫ్ట్ గా..

ఇక వామిక గబ్బి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. 2015లో వచ్చిన ‘భలే మంచిరోజు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యలో చాలా సినిమాలు చేసిందీ కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు డీసీ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు  వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు అడివి శేష్ ‘గూఢచారి 2’లో హీరోయిన్‌గా చేస్తోంది అందాల తార. దీంతో పాటు రిషభ్ శెట్టి ‘జై హనుమాన్’లోనూ ఈమెని కీలక పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

వామికా గబ్బి డీసీ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా?జబర్దస్త్‌ ఫైమాపై విమర్శలు
తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా?జబర్దస్త్‌ ఫైమాపై విమర్శలు
కమ్మగా కడుపు నిండా తినాలా? అయితే ఈ రిసిపీ ట్రై చేయండి!
కమ్మగా కడుపు నిండా తినాలా? అయితే ఈ రిసిపీ ట్రై చేయండి!
ఓటింగ్‌లో ఊహించని మలుపులు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
ఓటింగ్‌లో ఊహించని మలుపులు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇవే.. !
CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇవే.. !
యాదాద్రి క్షేత్రంలో భక్తుల ఆకలి తీరుస్తున్న నారసింహుడి కారుణ్యం
యాదాద్రి క్షేత్రంలో భక్తుల ఆకలి తీరుస్తున్న నారసింహుడి కారుణ్యం
వచ్చే ధన్‌తేరస్‌ వరకు బంగారమా? వెండా? దేనిలో ఎక్కువ లాభాలు ?
వచ్చే ధన్‌తేరస్‌ వరకు బంగారమా? వెండా? దేనిలో ఎక్కువ లాభాలు ?
మీ వయసు ప్రకారం రోజూ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..?
మీ వయసు ప్రకారం రోజూ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..?
లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి జీవితం గొప్ప మలుపు తిరగడం ఖాయం
లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి జీవితం గొప్ప మలుపు తిరగడం ఖాయం
బిగ్‌బాస్‌లో అతనినే గెలిపించండి..జిమ్ జిమ్ తార లక్ష్మి రిక్వెస్ట్
బిగ్‌బాస్‌లో అతనినే గెలిపించండి..జిమ్ జిమ్ తార లక్ష్మి రిక్వెస్ట్
రాహువు అనుగ్రహం.. 2027లో వీరి జాతకాల్లో కొత్త వెలుగులు
రాహువు అనుగ్రహం.. 2027లో వీరి జాతకాల్లో కొత్త వెలుగులు