AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adarsha Kutumbam OTT: ఓటీటీలోకి వెంకీ-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

Adarsha Kutumbam OTT: ఓటీటీలోకి వెంకీ-త్రివిక్రమ్‌ల 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aadarsha Kutumbam Movie
Basha Shek
|

Updated on: Nov 22, 2026 | 1:38 PM

Share

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కన్నడ బ్యూటీ, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ సెకెండ్ హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైంది. మరీ మల్లీ శ్వరి, నువ్వు నాకు నచ్చావ్ రేంజ్ లో లేకపోయినా ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది. విక్టరీ వెంకటేష్ సెటిల్ట్ యాక్టింగ్, త్రివిక్రమ్ డైరెక్షన్, శ్రీనిధి, నివేద, డింపుల్ గ్లామర్ ఆదర్శ కుటుంబం సినిమాను హిట్ రేసులోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆదర్శ కుటుంబం సినిమా రన్ అవుతోంది. అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అది కూడా ఈ వారంలోనే. ఆదర్శ కుటుంబం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 40 కోట్లకు పైగా సినిమా నిర్మాతలకు వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో నవంబర్ 27 (శుక్రవారం) నుంచే ఆదర్శ కుటుంబం ఓటీటీలోకి రానుందని టాక్. ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ అయినా త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’ సినిమాను నిర్మించారు. నారా రోహిత్, యువీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌భీర్ సంధూ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. . రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, నవిన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఆదర్శ కుటుంబం సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

నెట్ ఫ్లిక్స్ లో వెంకీ ఆదర్శ కుటుంబం సినిమా..

ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us