ఈపీఎఫ్‌వో పెన్షన్‌దారులకు అలర్ట్.. నెంబర్ మర్చిపోతే నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?
ఈపీఎఫ్ఓ పెన్షన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీరు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ మర్చిపోతే సులువుగా గుర్తించవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా మెంబర్ ఐడీ నెంబర్ నమోదు చేయడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇదెలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ పొందుతున్నవారికి అలర్ట్. మీరు పదవీ విరమణ తర్వాత ఒకవేళ పెన్షన్ పొందుతుంటే.. పెన్షన్ పేమెంట్ ఆర్డర్(PPO) నెంబర్ అనేది అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. పెన్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలు చెక్ చేసుకునేందుకు ఇది మీకు సహాయపడుతుంది. పెన్షన్ మీకు అకౌంట్లో జమ అయిందా.. లేదా అనేది తెలుసుకోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్ మార్చుకోవడం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ 12 అంకెలు ఉంటుంది. ఒకవేళ మీరు పీపీఓ నెంబర్ మర్చిపోతే నిమిషాల్లోనే దానిని కనిపెట్టవచ్చు. ఈపీఎఫ్ఓ పెన్షనర్ పోర్టల్‌లోకి వెళ్లి దీనిని కనిపెట్టవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
పీపీఓ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?
– EPFO అధికారిక వెబ్‌సైట్ http://www.epfo.gov.inను సందర్శించండి
-హోమ్ పేజీలో పెన్షనర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
– అనంతనం లాగిన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
– ఎడమ వైపున మెనూలో ‘మీ PPO నంబర్‌ను తెలుసుకోండి’ అనేది ఎంపిక చేసుకోండి
-బ్యాంక్ ఖాతా నంబర్ నుండి PPO నంబర్‌ను ఎలా కనుగొనాలనే ఆప్షన్ ఎంచుకోండి
– బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయండి
– అనంతరం మీ PPO నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
-రెండో ఆప్షన్ మీ మెంబర్ ఐడిని ద్వారా తెలుసుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు
-EPFO మెంబర్ ఐడిని నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
-అనంతరం మీ PPO నంబర్ పోర్టల్‌లో కనిపిస్తుంది
అసలు పీపీఓ నెంబర్ అంటే ఏంటి..?
పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని అర్థం. అంటే మీకు పెన్షన్ చెల్లించే రికార్డులను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఇది ప్రత్యేకమైన 12 నెంబర్లతో ఉంటుంది. మొదటి ఐదు అంకెలు పీపీఓ జారీ చేసిన సంస్థ కోడ్‌ను సూచిస్తే.. తర్వాత రెండు నెంబర్లు పీపీఓ జారీ చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. ఆ తర్వాతి నాలుగు నెంబర్లు పెన్షన్ రికార్డును తెలుపుతాయి. చివరి నెంబర్ ధృవీకరణ కూడా ఉపయోగపడుతుంది. పెన్షన్‌దారుడి పెన్షన్‌కు సంబంధించిన వివరాలను ఇది తెలుపుతుంది.
