AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో చెప్పిన మాట నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది: జబర్దస్త్ మహేష్

రంగస్థలం మహేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం, ఎదుర్కొన్న కష్టాలపై మనసు విప్పి మాట్లాడారు. 2011లో డిగ్రీ పూర్తయిన తర్వాత డిస్టెన్స్‌లో ఎంబీఏ ఫైనాన్స్ చదువుతూ కోకో-కోలా కంపెనీలో నైట్ షిఫ్ట్ చేసేవాడినని ఆయన తెలిపాడు.

ఆ హీరో చెప్పిన మాట నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది: జబర్దస్త్ మహేష్
Mahesh
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2026 | 12:53 PM

Share

నటుడు జబర్దస్త్ మహేష్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా రంగస్థలం సినిమాతో తన అనుభవాలను పంచుకున్నారు. రామ్ చరణ్ కు రంగస్థలం సినిమా జీవితంలో మర్చిపోలేని చిత్రమని, ఈ సినిమా ముందు, తర్వాత ఆయన కెరీర్ లో స్పష్టమైన మార్పు వచ్చిందని మహేష్ పేర్కొన్నారు. త్రిబుల్ ఆర్ వంటి భారీ విజయం తర్వాత కూడా రామ్ చరణ్ రంగస్థలం గురించి ప్రస్తావిస్తారని తెలిపారు. మహేష్ తన పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్నారు, ముఖ్యంగా రామ్ చరణ్ చెవిటి పాత్రను హైలెట్ గా అభివర్ణించారు. రామ్ చరణ్, సమంతలతో రంగస్థలం సెట్స్ లో తనకున్న అనుభవాలను మహేష్ వివరించారు. మొదటి రోజు షూటింగ్ తర్వాత రామ్ చరణ్ తో ఫోటో దిగేందుకు వెళ్ళగా, ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఫోటో అడిగారని తెలిపారు. కండలు పెంచుతున్నావా అని చరణ్ అడిగినప్పుడు, తాను ధూమ్ లో జాన్ అబ్రహం లా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పగా, ధృవలో రామ్ చరణ్ లా అవ్వాలని లేదా అని ప్రశ్నించారని మహేష్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆయనతో పోల్చుకునే స్థాయి మనది కాదు సర్ అని చెప్పగా, రామ్ చరణ్ తన టైమింగ్ ను మెచ్చుకున్నారని తెలిపారు.

దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్, సమంతలకు తన యాసను, నటనను సిఫార్సు చేశారని మహేష్ పేర్కొన్నారు. సుకుమార్ తనకంటే మహేష్ కు ఇక్కడి యాస బాగా తెలుసని, అతన్ని గమనించమని చెప్పారని తెలిపారు. దీని వల్ల రామ్ చరణ్, సమంత తనను మహేష్, మహేష్ అని ఆప్యాయంగా పిలుస్తూ, బాగా చూసుకున్నారని అన్నారు. రామ్ చరణ్ ఫ్రూట్స్, బ్రేక్‌ఫాస్ట్ తాను ఎక్కువగా తినేవాడినని సరదాగా చెప్పారు. సమంత కూడా సినిమా పూర్తయిన తర్వాత నీకేం కావాలి? అని అడిగినప్పుడు, తాను కేవలం ఒక సెల్ఫీ దిగి వచ్చేశానని, ఆమె మంచితనానికి ముగ్ధుడయ్యానని మహేష్ పంచుకున్నారు. మహానటి సినిమా సమయంలో కీర్తి సురేష్ కూడా తప్పులు చేస్తే సరిదిద్ది, ఒక తల్లిలా చూసుకున్నారని తెలిపారు. రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆయన తాతగారు అల్లు రామలింగయ్య గారు చెప్పిన ఒక సూక్తిని చరణ్ తనతో పంచుకున్నారని మహేష్ తెలిపారు. పెదవి దాటిన మాటకి నువ్వు బానిస. పెదవి దాటని మాటకి నువ్వు రాజు అనే ఈ మాట తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని, తన మాట్లాడే విధానాన్ని ప్రభావితం చేసిందని మహేష్ వివరించారు. తాను ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కాబట్టి, ఈ మాట తనను ఆలోచింపజేసిందని అన్నారు. అయితే, దర్శకుడు సుకుమార్ “వాడు అలా ఉన్నాడు కాబట్టే ఇక్కడిదాకా వచ్చాడు సార్” అని చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందని మహేష్ నవ్వతూ చెప్పారు.

తన కెరీర్ ఎంపిక గురించి మాట్లాడుతూ, ఈ రంగంలోకి రావడానికి కారణం, ఒక ఆర్టిస్ట్ గా ఒక దర్శకుడు, నిర్మాత, హీరో దగ్గరే ఆగిపోతామని, కానీ ఈ ఫీల్డ్ (మీడియా)లో ఉంటే దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు వంటి అందరూ తన దగ్గరికే వస్తారని మహేష్ తెలిపారు. చిరంజీవి గారి దగ్గరికి ఆర్టిస్టుగా వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టి ఉండేదని, కానీ ఈ మార్గం ద్వారా వేగంగా వెళ్లగలిగానని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తాను తన మరదలిని పెళ్లి చేసుకున్నానని, బంధువుల్లో ఆడపిల్లలను తమకంటే మంచి పొజిషన్ లో ఉన్నవారికి ఇవ్వాలని, కోడలిగా తీసుకున్నప్పుడు తమకంటే కొంచెం తక్కువ పొజిషన్ లో ఉన్నవారిని తీసుకోవాలని పెద్దలు చెప్పే మాటలను గుర్తు చేసుకున్నారు. ఈ సూత్రం తన విషయంలో కూడా వర్తించిందని మహేష్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us