AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒకప్పుడు స్టుపిడ్ అన్న గవాస్కర్.. ఇప్పుడు పంత్ సెంచరీకి చప్పట్లు

Rishabh Pant: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ టెస్టులో రిషభ్ పంత్ 128 పరుగులతో సెంచరీ సాధించాడు. అతడు శతకం పూర్తి చేయగానే సునీల్ గవాస్కర్ చిరునవ్వుతో చప్పట్లు కొట్టారు. గతంలో పంత్ షాట్ ఎంపికపై ‘స్టుపిడ్’ అంటూ విమర్శించిన గవాస్కర్ తాజా స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెంచరీతో పంత్ అరుదైన రికార్డు కూడా సృష్టించాడు.

Watch Video: ఒకప్పుడు స్టుపిడ్ అన్న గవాస్కర్.. ఇప్పుడు పంత్ సెంచరీకి చప్పట్లు
Rishabh Pant
Rakesh
|

Updated on: Nov 22, 2026 | 12:15 PM

Share

Watch Video: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదిరిపోయే సెంచరీతో ఆకట్టుకున్నాడు. నాలుగో రోజు ఆటలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ పూర్తి చేశాడు. అయితే పంత్ సెంచరీ కంటే ఎక్కువగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పంత్ శతకం సాధించగానే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చిరునవ్వుతో చప్పట్లు కొట్టారు. గతంలో పంత్ షాట్ ఎంపికపై తీవ్రంగా విమర్శించిన గవాస్కర్.. ఇప్పుడు అతడి ఆటను అభినందించడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన పంత్

వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 55 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. నాలుగో రోజు నైట్‌వాచ్‌మన్ అన్‌షుల్ కాంబోజ్‌తో కలిసి బ్యాటింగ్ కొనసాగించాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో ఆకట్టుకునే షాట్లు ఆడాడు. 99 పరుగుల వద్ద రివర్స్ స్వీప్‌తో బౌండరీ సాధించిన పంత్.. ఆ తర్వాతి బంతిని మిడ్ ఆఫ్ మీదుగా సిక్సర్‌గా మలిచి 135 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.

పంత్ సెంచరీకి గవాస్కర్ చప్పట్లు

పంత్ సెంచరీ సాధించగానే మైదానంలో ఉన్న ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. కామెంటరీ బాక్స్ సమీపంలో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా చిరునవ్వుతో చప్పట్లు కొట్టారు. పంత్ ఆకాశం వైపు చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సమయంలో గవాస్కర్ ఇచ్చిన రియాక్షన్‌ను ప్రసార సంస్థ వీడియోగా పంచుకోవడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంత్ ఆటను గవాస్కర్ ఆస్వాదించడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

గతంలో పంత్‌పై తీవ్ర విమర్శలు

గవాస్కర్ తాజా స్పందనకు 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాటి సంఘటన కారణంగా ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది. ఆ సిరీస్‌లో పంత్ అనవసరమైన దూకుడుతో షాట్ ఆడి వికెట్ పారేసుకున్న సందర్భంలో గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్. అక్కడ ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారని తెలిసినా అలాంటి షాట్ ఆడతావా? అది చాలా తెలివితక్కువ షాట్. దాంతో జట్టుకు నష్టం జరుగుతుంది” అంటూ విమర్శించారు. అప్పట్లో గవాస్కర్ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు అదే పంత్ కీలక సమయంలో సెంచరీ చేయడంతో గవాస్కర్ చప్పట్లు కొట్టిన దృశ్యం అభిమానులకు ప్రత్యేకంగా కనిపిస్తోంది.

పంత్ ఖాతాలో అరుదైన రికార్డు

ఈ మ్యాచ్‌లో పంత్ 153 బంతులు ఎదుర్కొని 128 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. రాచిన్ రవీంద్ర బౌలింగ్‌లో నాథన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. ఈ సెంచరీతో పంత్ టెస్టుల్లో తన తొమ్మిదో శతకాన్ని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. ఈ నాలుగు SENA దేశాల్లో టెస్టు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ జాబితాలో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us