AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కుర్రాడి షర్ట్ బాలేదు మార్చండి హీరో చెప్పగానే నేను షాక్.. తెలియకుండానే కళ్లలో నీళ్లు నిండిపోయాయి

చిరంజీవి మాస్టర్ సినిమా సమయంలో, నటుడు చిత్రం శ్రీను తన జీవితంలో మర్చిపోలేని సంఘటనలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన కష్టాలు, తల్లిదండ్రుల వ్యతిరేకత, ఆ తర్వాత సినిమాల్లోకి ఎలా వచ్చారు. అలాగే ఓ స్టార్ హీరో చేసిన పనిని గుర్తుచేసుకున్నారు

ఆ కుర్రాడి షర్ట్ బాలేదు మార్చండి హీరో చెప్పగానే నేను షాక్.. తెలియకుండానే కళ్లలో నీళ్లు నిండిపోయాయి
Chitram Seenu
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2026 | 1:14 PM

Share

నటుడు చిత్రం శ్రీను తన సినీ రంగ ప్రవేశం, ప్రారంభ దశలోని అలుపెరుగని పోరాటం, మెగాస్టార్ చిరంజీవి గారితో మాస్టర్ సినిమా సెట్స్‌లో ఎదురైన మర్చిపోలేని సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన శ్రీను, సినిమా పట్ల ఉన్న ప్రేమతో 1995లో హైదరాబాద్ వచ్చారు. తన సినీ కలలను తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పుడు, తీవ్రమైన వాదనలు జరిగేవని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకసారి, ఆ కోపంతో, తన తండ్రి ఫోటోలు ఉండే స్థానంలో చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమా పోస్టర్‌ను అతికించానని, అది తన అభిమాన పోస్టర్‌ని తెలిపారు. “చిరంజీవి నీకు అన్నం పెడతాడా?” అని తన తండ్రి అడిగినప్పుడు, “ఆయనే నాకు అన్నం పెడతాడు!” అని ధైర్యంగా సమాధానమిచ్చానని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో నిలదొక్కుకోవడానికి చిత్రం శ్రీను ఎన్నో కష్టాలు పడ్డారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేశారు. కృష్ణా నగర్‌లో నివసిస్తూ, ఫోటోలు, కాంటాక్ట్ నంబర్ల కోసం ఒక ఎస్.టి.డి. బూత్‌లో పనిచేశారు. అక్కడే ఉదయం టిఫిన్‌ల కోసం, ఆహారం కోసం మూడు గంటలు కూర్చునేవారని, అది ఒక పూట ఆకలిని తీర్చేదని పేర్కొన్నారు.

అంతేకాదు, ఎస్.టి.డి. బూత్‌ పైన ఉండే రాకేష్ మాస్టర్ ఇన్‌స్టిట్యూట్ వద్ద రాత్రి బీరు బాటిళ్లను వదిలి వెళ్ళే వారి నుంచి, ఆ బాటిళ్లను సేకరించి రెండు రూపాయల చొప్పున అమ్మి, ఆ డబ్బుతో ఉదయం టిఫిన్ చేసేవారట. పేపర్లు అమ్మి చిల్లర సంపాదించేవారట. సినిమాపై పిచ్చితో వచ్చిన తాను కృష్ణా నగర్‌లో పడాల్సిన కష్టాలన్నీ పడ్డానని, అయితే అది చాలా తక్కువ సమయంలోనే అని శ్రీను గుర్తు చేసుకున్నారు. మాస్టర్ సినిమా ఓపెనింగ్‌కు వెళ్ళినప్పుడు, చిరంజీవి గారిని చూశానని, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని రాజీవ్ అనే వ్యక్తిని కలిసి తన ఫోటో ఇచ్చానని తెలిపారు. ఆ సినిమాకు తాను నేరుగా ఎంపిక కాకపోయినా, తనను కోఆర్డినేట్ చేసిన స్నేహితుడి ద్వారా కమిట్ అయ్యారు. సినిమాలో చిరంజీవి గారు కాలేజీలోకి ఎంటర్ అయ్యే సన్నివేశంలో, ఒక కుర్రాడు సిగరెట్‌తో వచ్చి “ఎక్స్‌క్యూజ్‌ మీ, మ్యాచ్ బాక్స్ ఉందా?” అని అడగాలి. ఈ పాత్రకు తాను ముందుకు వచ్చానని, రాజీవ్ తనను ఎంపిక చేశారని చెప్పారు. ఆ సన్నివేశం షూటింగ్ సమయంలో, చిరంజీవి గారు “ఈ కుర్రాడికి షర్ట్ మారిస్తే బాగుంటుంది” అని చెప్పడంతో, ఇద్దరు కాస్ట్యూమర్లు తనను తీసుకెళ్ళి రెడ్ కలర్ షర్ట్ మార్చారని శ్రీను తెలిపారు. ఆ క్షణం నుంచి కాస్ట్యూమ్ రూమ్‌కి వెళ్ళే దారిలో తన కళ్ళు తెలియకుండానే నీళ్ళతో నిండిపోయాయని, మెగాస్టార్ తనను గమనించి ఒక జూనియర్ ఆర్టిస్ట్ షర్ట్ మార్చమని చెప్పడం తనను ఎంతగానో కదిలించిందని ఉద్వేగంగా వివరించారు.

తర్వాత, ఇంటర్వెల్ సన్నివేశంలో కూడా చిరంజీవి గారితో కలిసి “మాస్టర్ గుడ్‌మార్నింగ్ మాస్టర్” అని చెప్పి తప్పించుకునే చిన్న షాట్ చేశానని, అలాగే క్లాస్‌రూమ్ డ్యాన్స్ సన్నివేశాల్లోనూ భాగమయ్యానని పేర్కొన్నారు. అత్యంత మర్చిపోలేని సంఘటన ఏమిటంటే, ఒక రోజు షూటింగ్‌కు తాను వెళ్ళలేనప్పుడు, చిరంజీవి గారు “మైఖేల్ రాలేదా?” అని అడిగారని, ఈ విషయాన్ని మరుసటి రోజు ఇతరుల ద్వారా తెలుసుకున్నానని చిత్రం శ్రీను వెల్లడించారు. తనను చిరంజీవి గారు పేరుతో గుర్తుపెట్టుకోవడం తన జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. మళ్ళీ ఆయనతో కలిసి నటించే అవకాశం రాలేదని, అందరిలాగా ఆయనను డిస్టర్బ్ చేయకూడదని భావిస్తున్నానని, కానీ వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, ఈ సంఘటనలన్నింటినీ ఆయనతో పంచుకోవాలని ఆశిస్తున్నానని చిత్రం శ్రీను తన మనసులోని మాటను బయటపెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ కుర్రాడి షర్ట్ బాలేదు మార్చండి హీరో చెప్పగానే నేను షాక్..
ఆ కుర్రాడి షర్ట్ బాలేదు మార్చండి హీరో చెప్పగానే నేను షాక్..
రెండు ప్లేట్ల ఇడ్లీలతో రోజంతా గడిపా.. వేణు స్వామి కన్నీటి కష్టాలు
రెండు ప్లేట్ల ఇడ్లీలతో రోజంతా గడిపా.. వేణు స్వామి కన్నీటి కష్టాలు
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ప్రభుత్వం శుభవార్త..
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ప్రభుత్వం శుభవార్త..
వాపులు, కఫాన్ని తగ్గించే పవర్‌ఫుల్ ఆకు.. లక్షలు సంపాదించొచ్చు..
వాపులు, కఫాన్ని తగ్గించే పవర్‌ఫుల్ ఆకు.. లక్షలు సంపాదించొచ్చు..
ఆ మూవీ పైనే భారం.. హిట్ కొట్టకపోతే ఈ బ్యూటీ ఇక సర్దుకోవడమేనా !!
ఆ మూవీ పైనే భారం.. హిట్ కొట్టకపోతే ఈ బ్యూటీ ఇక సర్దుకోవడమేనా !!
ఆ హీరో చెప్పిన మాట నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది
ఆ హీరో చెప్పిన మాట నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది
వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును అధిగమించిన టామ్ లాథమ్
వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును అధిగమించిన టామ్ లాథమ్
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్..
ఇంటి వద్దే టేస్టీ చికెన్ పులావ్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే వంట
ఇంటి వద్దే టేస్టీ చికెన్ పులావ్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే వంట
టమాటా జ్యూస్ vs నారింజ జ్యూస్..షుగర్ కంట్రోల్ చేయడానికి ఉదయం ఏది?
టమాటా జ్యూస్ vs నారింజ జ్యూస్..షుగర్ కంట్రోల్ చేయడానికి ఉదయం ఏది?