AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ఎగిరి గంతేసే వార్త.. ఈ సారి ముందుగానే డబ్బులు.. ప్రభుత్వ డెసిషన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ నెల పించన్లపై బిగ్ అప్డేట్ వచ్చింది. పంచాయతీ ఎన్నికల కారణంగా ముందుగానే చేతికి అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. నిధులు కూడా విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పించన్ల పంపిణీపై కూడా ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇచ్చింది.

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ఎగిరి గంతేసే వార్త.. ఈ సారి ముందుగానే డబ్బులు.. ప్రభుత్వ డెసిషన్ ఇదే..
Ap Pensions
Venkatrao Lella
|

Updated on: Nov 22, 2026 | 1:04 PM

Share

ఏపీలో పించన్లదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పించన్లు పొందుతున్నవారికి ముందే డబ్బులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ నెల పెన్షన్లను ముందుగానే పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రతి నెల మాదిరిగానే కాకుండా ఈసారి డిసెంబర్ నెల పించన్లను నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లోనే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 2వ తేదీన పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల విధులకు అంతరాయం కలగకుండా ముందుగానే పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. గత నవంబర్ నెలలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల కారణంగా అక్టోబర్ 30వ తేదీనే నవంబర్ నెల పెన్షన్లను పంపిణీ చేశారు. దీంతో ఒక్కరోజు ముందుగానే లబ్దిదారులకు నగదు అందాయి. ఇప్పుడు అదే విధానాన్ని డిసెంబర్ నెల పెన్షన్లకు కూడా అముల చేయనున్నట్లు కూటమి సర్కార్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 62 లక్షల మందికి పైగా పెన్షన్లు పొందుతున్నారు. వీరిందరూ డిసెంబర్ నెల పెన్షన్లు ముందుగానే అందుకోనున్నారు.

ముందుగానే పించన్ల పంపిణీ..

నవంబర్ నెలలో ఏదైనా కారణం చేత పెన్షన్ తీసుకోని వారు.. నవంబర్, డిసెంబర్ రెండు నెలల పెన్షన్ కలిపి ఒకేసారి రూ.8 వేలు తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) పరిధిలోకి వచ్చే సుమారు 9.34 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర వాటా  నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మిగిలిన సొమ్ము పెన్షనర్లందరికీ గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందజేస్తారు. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే పెన్షనర్లు తమ NPCI లింక్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లలో కేంద్ర వాటా ఖాతాలోకి, మిగిలిన మొత్తం చేతికి అందుతుంది. అలాగే 80 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు కూడా కొంత మొత్తం ఖాతాలోకి.. మిగిలిన మొత్తం చేతికి అందుతుంది. డిసెంబర్ నెల పించన్ల కోసం ప్రభుత్వం రూ.2774 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.

కొత్త పించన్లపై అప్డేట్..

కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఒకసారి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ.. ఎన్నికల తర్వాత డిసెంబర్ నెలలో మరోసారి వెరిఫికేషన్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా నిజమైన అర్హులను గుర్తించి, అర్హుల జాబితాను రూపొందిస్తారు. పెన్షన్ మంజూరుకు ఏడు దశల ధ్రువీకరణ లేదా ఏడు అనర్హత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో అన్ని ప్రమాణాలకు సాటిస్‌ఫై అయిన వారికి మాత్రమే పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.  జనవరి నెల నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Follow Us
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ప్రభుత్వం శుభవార్త..
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ప్రభుత్వం శుభవార్త..
వాపులు, కఫాన్ని తగ్గించే పవర్‌ఫుల్ ఆకు.. లక్షలు సంపాదించొచ్చు..
వాపులు, కఫాన్ని తగ్గించే పవర్‌ఫుల్ ఆకు.. లక్షలు సంపాదించొచ్చు..
ఆ మూవీ పైనే భారం.. హిట్ కొట్టకపోతే ఈ బ్యూటీ ఇక సర్దుకోవడమేనా !!
ఆ మూవీ పైనే భారం.. హిట్ కొట్టకపోతే ఈ బ్యూటీ ఇక సర్దుకోవడమేనా !!
ఆ హీరో చెప్పిన మాట నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది
ఆ హీరో చెప్పిన మాట నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది
వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును అధిగమించిన టామ్ లాథమ్
వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును అధిగమించిన టామ్ లాథమ్
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్..
ఇంటి వద్దే టేస్టీ చికెన్ పులావ్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే వంట
ఇంటి వద్దే టేస్టీ చికెన్ పులావ్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే వంట
టమాటా జ్యూస్ vs నారింజ జ్యూస్..షుగర్ కంట్రోల్ చేయడానికి ఉదయం ఏది?
టమాటా జ్యూస్ vs నారింజ జ్యూస్..షుగర్ కంట్రోల్ చేయడానికి ఉదయం ఏది?
పంచాయతీ ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ బిగ్ అనౌన్స్‌మెంట్
పంచాయతీ ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ బిగ్ అనౌన్స్‌మెంట్
రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ..
రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ..