AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండపైకి ఎక్కుతున్న నీరు.. ఆంధ్రాలో అద్భుతం..

విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా నీరు కొండపైకి ఎక్కుతోంది. ఇది మాయ కాదు.. ఒక గ్రామీణ రైతు మేధస్సు. తూర్పుగోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన రైతు శ్రీనివాస్‌ రూపొందించిన హైడ్రో లిఫ్ట్ ర్యామ్‌ పంప్‌ ప్రవహించే నీటి శక్తిని ఉపయోగించి ఎత్తైన ప్రాంతాలకు నీటిని తరలిస్తోంది.

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండపైకి ఎక్కుతున్న నీరు.. ఆంధ్రాలో అద్భుతం..
Farmer Srinivas Hydro Lift Ram Pump
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Aug 12, 2026 | 7:07 PM

Share

విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా నీరు కొండపైకి ఎక్కుతోంది.. అవును మీరు దీనిని కచ్చితంగా నమ్మాల్సిందే.. మాయ కాదు.. మంత్రం కాదు.. ఒక గ్రామీణ రైతు మేధస్సు.. ఈ కథనం చదివితే మీ ఆలోచనలన్నీ మారిపోతాయి.. రైతు పేరు శ్రీనివాస్… తూర్పుగోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన రైతు, గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న సాగునీటి సమస్యకు ఆయన కనిపెట్టిన హైడ్రో లిఫ్ట్ ర్యామ్ పంప్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అసాధారణ ఆవిష్కరణకు గుర్తింపుగా ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రైతు పేరు శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు.

చిన్న వాగు నుండి వేగంగా పొంగి పొరలే నీరు. ఆ ప్రవహించే నీటి శక్తినే ఉపయోగించి ఈ యంత్రం నిమిషానికి 30 నుంచి 40 లీటర్ల నీటిని లిఫ్ట్ చేసి ఎత్తైన ప్రాంతాలకు చేరవేస్తుంది. విద్యుత్ అవసరం లేదు.. ఇంధనం అవసరం లేదు.. ప్రకృతే దీని శక్తి. వరదలు వచ్చినా భయపడాల్సిన పనిలేదు. నీటి ఒత్తిడిని గుర్తించి ప్రత్యేకంగా రూపొందించిన ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోతాయి. అందుకే ఇది గిరిజన ప్రాంతాల వాగుల్లో కూడా సురక్షితంగా పనిచేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదే పరికరంతో దాదాపు 10 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

వీడియో చూడండి..

గ్రామాలకు వెలుగులు అందించడమే కాదు.. ధాన్యం, పసుపు వంటి ఉత్పత్తులను స్థానికంగానే ప్రాసెస్ చేయడానికి, తాగునీటిని శుద్ధి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని శ్రీనివాస్ అంటున్నారు.. ఒక రైతు ఆలోచన.. ఒక గ్రామం కాదు, వేలాది గిరిజన కుటుంబాల జీవితాలను మార్చగల సాంకేతిక పరిష్కారంగా మారడంతోపాటు.. ఈ రైతు శ్రీనివాస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు.. ఏ పనైనా చేయవచ్చు.. అనేలా శ్రీనివాస్ నిరుపించారని పలువురు ఆయన్ను అభినందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..