AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో 29 ఏళ్ల స్టార్.. ఆ ప్లేయర్‌కు టీమిండియా తలుపులు క్లోజ్..!

Rinku Singh Flop: టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న రింకూ సింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులే చేశాడు. వరుస ఫ్లాప్‌లతో జాతీయ జట్టులోకి పునరాగమనం కష్టంగా మారింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం..!

వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో 29 ఏళ్ల స్టార్.. ఆ ప్లేయర్‌కు టీమిండియా తలుపులు క్లోజ్..!
Rinku Singh
Venkata Chari
|

Updated on: Nov 23, 2026 | 2:10 PM

Share

Rinku Singh Flop: టీమిండియాలో చోటు సంపాదించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అదరగొట్టినా కొందరికే అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకునే అవకాశం వస్తుంది. అందులోనూ నిలదొక్కుకునేది మరికొందరే. ఫామ్ లేకపోతే జట్టుకు దూరం కావాల్సిందే. ఇప్పుడు 29 ఏళ్ల భారత బ్యాటర్ రింకూ సింగ్ పరిస్థితి అలాగే మారింది. వరుస వైఫల్యాలతో జట్టులోకి తిరిగి రావడం కష్టంగా మారింది.

రైజింగ్ స్టార్స్‌లో ఘోర వైఫల్యం..

ఐపీఎల్ వేదికగా తన ప్రతిభను చాటిన రింకూ సింగ్ ప్రస్తుతం పరుగుల కోసం నానా తంటాలు పడుతున్నాడు. దోహాలో జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలోనూ అతడి బ్యాట్ మౌనంగానే ఉంది.

ఈ టోర్నీ రింకూకు టీమిండియాలోకి పునరాగమనానికి కీలక వేదికగా భావించారు. అతడిని కేవలం బ్యాటర్‌గానే కాకుండా వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ రెండు మ్యాచ్‌ల్లో అతడు చేసింది కేవలం 15 పరుగులు మాత్రమే. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ ఇన్నింగ్స్‌తో అందరినీ నిరాశపరిచాడు. ఈ ప్రదర్శన తర్వాత భారత జట్టులోకి రావడం కష్టమనే అంచనాలు వినిపిస్తున్నాయి.

వరుసగా ఫ్లాప్ అవుతున్న రింకూ..

చివరి 5 మ్యాచ్‌ల్లో రింకూ 36 సగటుతో మొత్తం 180 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఒకే ఒక్క శతకం ఉంది, ఒక్క అర్ధశతకం కూడా లేదు. చివరిసారిగా 2026 జులైలో జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో భారత జెర్సీలో కనిపించాడు. ఆ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 2 ఇన్నింగ్స్‌ల్లో 37 పరుగులే చేశాడు.

యువ ఆటగాళ్లు బ్యాట్, బంతితో అదరగొడుతున్న వేళ రింకూ ఫామ్ పడిపోవడం అతడి కెరీర్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు ఫామ్‌ను తిరిగి పొందకపోతే టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us