AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కూరలు రుచిగా రావాలి అంటే ఈ సీక్రెట్ పొడిని ఒక్క సారి వేసి చూడండి

వంట చేసేటప్పుడు ఎన్ని రకాల మసాలాలు వేసినా, అప్పుడే ఇంట్లో వేయించి నూరిన ధనియాల పొడి వేస్తే కూరకు వచ్చే రుచి, సువాసనే వేరు. వెజ్ కూరలైనా, నాన్‌వెజ్ గ్రేవీలైనా సరే, చివర్లో ఒక్క స్పూన్ ఈ ప్రత్యేక ధనియాల పొడి వేస్తే చాలు, వంటకం రెస్టారెంట్ స్థాయికి చేరుతుంది. దీనితో పాటు రసం, పప్పుచారు, టమాటా కూరలకు కమ్మని వాసననిచ్చే మెంతిపొడిని కూడా ఒకేసారి తయారు చేసి పెట్టుకుంటే వంట పని ఎంతో సులభమవుతుంది.

Phani CH
|

Updated on: Nov 23, 2026 | 1:19 PM

Share
కావలసిన పదార్థాలు: నాటు ధనియాలు 1 కప్పు సుమారు 100 గ్రాములు, మెంతులు అర టీస్పూన్ మరియు మెంతిపొడి కోసం 1 కప్పు, జీలకర్ర 2 టీస్పూన్లు, ఆవాలు అర టీస్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2, లవంగాలు 5, బిర్యానీ ఆకులు 2, ఉప్పు పావు టీస్పూన్, పసుపు 1 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు 12.

1 / 5
ముందుగా ధనియాల పొడి కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు నాటు ధనియాలను వేయాలి. సన్నని మంటపై కలుపుతూ దోరగా వేయించాలి. నాటు ధనియాలు వాడటం వల్ల పొడికి అద్భుతమైన పరిమళం వస్తుంది. ధనియాలు కాస్త వేగాక అర టీస్పూన్ మెంతులు, రెండు టీస్పూన్ల జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఐదు లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. చివరగా రెండు బిర్యానీ ఆకులను తుంచి వేసి, అన్నీ కరకరలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

2 / 5
ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి, పావు టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ పసుపు కలిపి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు కలపడం వల్ల పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. చివరగా పొట్టు తీయని పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ మోడ్‌లో ఒకటి రెండు సార్లు తిప్పితే ఘుమఘుమలాడే ధనియాల పొడి సిద్ధమవుతుంది.

3 / 5
అలాగే మెంతిపొడి కోసం ఒక కప్పు మెంతులను కడాయిలో వేసి సన్నని మంటపై రంగు మారి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. చల్లారిన తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుంటే మెంతిపొడి తయారవుతుంది.

4 / 5
ఈ రెండు పొడులను పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలలో నిల్వ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటాయి. వంకాయ-టమాటా కలిపిపెట్టిన కూరలో చిటికెడు మెంతిపొడి, ఒక స్పూన్ ఈ ధనియాల పొడి వేసి వండితే రుచి అమోఘంగా ఉంటుంది.

5 / 5
Follow Us