స్వీట్లు తిన్న తర్వాత మళ్లీ సాధారణ ఆహారం తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయా?

23 November 2026

TV9 Telugu

TV9 Telugu

మితిమీరిన చక్కెర పదార్థాలు తీసుకున్న తర్వాత తిరిగి సాధారణ ఆహారపు అలవాట్లకు మారినా రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే అదుపులోకి వస్తాయా? 

TV9 Telugu

నిజానికి, మనం తీసుకునే కార్బొహైడ్రేట్లు జీర్ణక్రియ సమయంలో చక్కెరలుగా విడిపోయి రక్తంలో కలుస్తాయి

TV9 Telugu

ఈ గ్లూకోజ్‌ను శరీర కణాలు ఉపయోగించుకోవడానికి, అదనపు గ్లూకోజ్‌ను నిల్వ చేసుకోవడానికి క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సహాయపడుతుంది

TV9 Telugu

సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలిగే వారిలో ఈ ప్రక్రియ ద్వారా గ్లూకోజ్ స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి

TV9 Telugu

తీసుకున్న ఆహారం పరిమాణం, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, దానికి శరీరం స్పందించే విధానాన్ని బట్టి దీని పెరుగుదలలో తేడాలు ఉంటాయి

TV9 Telugu

కొన్ని రోజుల పాటు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం జీవక్రియపై ప్రభావం చూపుతాయి

TV9 Telugu

TV9 Telugu

స్వల్పకాలంలో అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంతోపాటు ఇన్సులిన్‌కు కాలేయం స్పందించే సామర్థ్యం తగ్గుతుంది

TV9 Telugu

TV9 Telugu

అయితే ఆరోగ్యవంతుల్లో కొద్దిరోజుల పాటు అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం, గ్లూకోజ్ స్పందనలో మార్పులు వస్తాయని నిరూపితం కాలేదు