AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. రాజమండ్రిలో ఓటర్లకు వినూత్న సందేశం!

ఎన్నికల వేళ ఓట్ల కోసం అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీస్తుంటే.. రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి మాత్రం వినూత్న సందేశంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన ఇంటి గేటుకు ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు నోడగల సుధా యాదవ్.

మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. రాజమండ్రిలో ఓటర్లకు వినూత్న సందేశం!
Vote Awareness
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 12:35 PM

Share

ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల హామీలు ఇస్తుంటారు. డబ్బు, బహుమతులు, ఇతర ప్రలోభాలతో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఓటు విలువను చాటుతూ రాజమండ్రిలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రాజమండ్రి 46వ వార్డుకు చెందిన నోడగల సుధా యాదవ్ తన ఇంటి గేటుకు ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు, కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫ్లెక్సీ కనిపించడంతో కొందరు ఆశ్చర్యపోతుండగా.. మరికొందరు ఆసక్తిగా చదువుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సుధా యాదవ్.. ఓటు అనేది అమ్ముకునే వస్తువు కాదని, ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తును నిర్ణయించే హక్కు అని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. తన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయడంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి సందేశాలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. తన ఇంటి గేటుపై ఏర్పాటు చేసిన చిన్న ఫ్లెక్సీ.. ఓటు విలువపై పెద్ద చర్చకు తెరతీస్తోంది. ఎన్నికల్లో ప్రలోభాలకు దూరంగా ఉండాలనే సందేశాన్ని వినూత్నంగా చాటుతోంది.

Follow Us