AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎందుకంటే?

‌ఒకప్పుడు తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ నటి తన పాదాలకు పూజలు చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywood: భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎందుకంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 12, 2026 | 6:46 PM

Share

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2010 ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. రెండో సినిమానే సిద్ధార్థ్ తో కలిసి బావ అనే మూవీలో నటించింది. అయితే ప్రణీతకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అత్తారింటికి దారేది అని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రణీత సెకెండ్ హీరోయినే అయినా తన యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం, హలో గురూ ప్రేమ కోసమే, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసిందీ అందాల తార. అయితే వీటిలో ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ రోల్సే కావడంతో పెద్దగా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది ప్రణీత. దీంతో 2021లో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుని సెటిలైపోయిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటాడు.

తాజాగా ప్రణీత సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. అంందులో తన భర్త కాళ్లకు ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించింది ప్రణీత. దీనికి భీమన అమావాస్య అని క్యాప్షన్ ఇచ్చింది ప్రణీత. దీంతో ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ భీమన అమావాస్య అనేది కర్ణాటకతో పాటు దక్షిణాదిలోని పలు ప్రాంతాలలో జరుపుకొనే హిందూ సంప్రదాయ పండుగ. ఆ రోజున భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆషాడ మాసంలో చివరి రోజున అమావాస్య నాడు ఈ పండుగను జరుపుకొంటారు. ఇందులో భాగంగానే ప్రణీత తన భర్త నితిన్ రాజుకు పూజలు చేసింది. గతంలో కూడా ఇలాగే పూజలు చేసి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

భర్త పాదాలకు నమస్కరిస్తున్న ప్రణీత..

కూతురితో ప్రణీత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us