AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మాస్ మహారాజ్ రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతి రాజు ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ రూరల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Maremma Movie
Basha Shek
|

Updated on: Sep 24, 2026 | 3:36 PM

Share

మాస్ మహారాజా రవితేజ ఇటీవలే ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాంటి రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అయ్యాడు. రవితేజ తమ్ముడు, నటుడు రఘు రాజు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ తెరకెక్కించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ను చూసి మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే తీరా థియేటర్లలో రిలీజయ్యాక ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మారెమ్మ సినిమా విఫలమైంది. తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాల చుట్టూ తెరకెక్కిన ఈ సినిమాలో పాయింట్ మంచిదే అయినా టేకింగ్‌ మాత్రం నిరాశపర్చింది. వసూళ్లు కూడా పెద్దగా రాలేదు. థియేటర్లలో పెద్దగా ఆడని మారెమ్మ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రవితేజ కుమారుడి సినిమా ఓటీటీలోకి రానుందని సమాచారం. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 09 నుంచే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు మారెమ్మ సినిమాను నిర్మించారు. మాధవ్ భూపతి రాజు సరసన దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. అలాగే సీనియర్ హీరో వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరి ప్రజలు తమ ఇలవేల్పు ‘మారెమ్మ’ దేవతను ఎంతో నిష్ఠతో పూజిస్తారు. ఊరి ఆచారం ప్రకారం అమ్మవారికి ఏటా ఒక పవిత్రమైన దున్నపోతును బలి ఇవ్వడం ఆనవాయితీ. ఇదే క్రమంలో ‘మారి’ అనే ఆ దున్నపోతును కర్ణి (మాధవ్ భూపతిరాజు) ఎంతో ప్రేమగా పెంచుతాడు. అయితే అమ్మవారికి బలి ఇచ్చే సమయానికి ఆ దున్నపోతు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది.మరి అసలు ఆ దున్నపోతు ఎక్కడికి పోయింది? దాన్ని వెతికే క్రమంలో కర్ణికి ఎదురైన పరిణామాలు ఏంటి? ఊరి పెద్దలు, గ్రామస్థులు ఎలా స్పందించారు? గ్రామాన్ని ఆ దున్నపోతు ఎలా కాపాడింది? అనేది మిగతా కథ.

మారెమ్మ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అయ్యబాబోయ్.. ఈ విషయం ఇన్నాళ్లు తెలీదే జుట్టు రాలడానికి కారణం ఇదా
అయ్యబాబోయ్.. ఈ విషయం ఇన్నాళ్లు తెలీదే జుట్టు రాలడానికి కారణం ఇదా
వైభవ్ సూర్యవంశీ రెండు ముక్కల్లో చెప్పేశాడుగా
వైభవ్ సూర్యవంశీ రెండు ముక్కల్లో చెప్పేశాడుగా
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు