AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్‌ను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు? మెగా హీరో మాటల్లోనే..

సుమారు ఐదేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు మెగా మేనల్లుడు హీరో సాయి దుర్గ తేజ్. తీవ్ర గాయాలు కావడంతో చాలా రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నాడు. తాజాగా ఈ చేదు సంఘటనను మరోసారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు సాయి దుర్గ తేజ్.

Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్‌ను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు? మెగా హీరో మాటల్లోనే..
Sai Durgha Tej
Basha Shek
|

Updated on: Sep 24, 2026 | 5:47 PM

Share

టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ఐదేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 2021 సెప్టెంబరులో బైక్ పై వెళుతున్న ఆయన ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. ఈ యాక్సిడెంట్ లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చాలా రోజుల పాటు ఆస్పత్రి బెడ్ పైనే ఉండిపోయాడు. ఆ తర్వాత దేవుడి దయతో పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగి ఐదేళ్లు పూర్తి కాగా మరోసారి ఆ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నాడు సాయి దుర్గ తేజ్. ఈ నేపథ్యంలో .. ‘రీబర్త్ డే’ అంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడీ మెగా మేనల్లుడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదే క్రమంలో కొందరు నెటిజన్లు యాక్సిడెంట్ సమయంలో సాయి దుర్గ తేజ్ ను కాపాడిన అబ్దుల్ సయ్యద్ ఫర్హాన్ ప్రస్తావనను తీసుకొచ్చారు. వీటికి స్పందించిన సుప్రీం హీరో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ‘సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ గురించి అడుగుతున్న వారందరికీ నేను చెప్పేది ఏంటంటే.. నేను ఇప్పటికే అతనికి ఆర్థికంగా సాయం చేశాను. అలాగే, అతనికి కుటుంబ బాధ్యతలు ఉన్నందున తన పనిపై తాను దృష్టి పెట్టుకునేలా, తనను వేరే ఏ విధంగానూ డిస్టర్బ్ చేయవద్దని అతను కోరాడు. అందుకే ఈరోజు నా మెసేజ్ కేవలం నన్ను ఆశీర్వదించిన వారందరి కోసమే. ఇప్పుడు కొందరు డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్, ఇతర వ్యక్తుల గురించి నన్ను అడగొచ్చు. నాకు స్పృహ వచ్చిన తర్వాత పెట్టిన నా మొదటి వీడియోలోనే.. నా ఆరోగ్యం కుదుటపడేలా నాకు అండగా నిలిచి, ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలిపాను. అలాగే ఇప్పుడు నన్ను తిడుతున్న వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమ, దయ ఏ రూపంలో వచ్చినా దాన్ని స్వీకరించడానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను’ అని రాసుకొచ్చాడు సాయి దుర్గ తేజ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.

అంతకు ముందు రీ బర్త్ అంటూ షేర్ చేసిన పోస్ట్ లో ‘.. ‘సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున నాకు నా కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ సపోర్ట్‌తో నాకు జీవితంలో రెండో ఛాన్స్ లభించింది. మీ సపోర్ట్‌లో ప్రతి ఒక్కటీ నాకు అవసరమైంది. నా గాయాల నుంచి 90% కోలుకున్నా. నా మాట తీరు, మరికొన్ని సవాళ్లతో సహా, నేను ఇంకా కొన్ని విషయాలపై పనిచేస్తున్నాను, కోలుకుంటున్నానని రోజుకొక అడుగు ముందుకు వేస్తున్నాను. నేను మీకు ఒకటే విషయం చెబుతున్నాను మీ ప్రేమ ఎప్పటికీ నన్ను విడిచిపెట్టదు. మీవల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు లేకపోతే నేను లేను నా ఈ కథ ద్వారా మీ అందరికీ చెప్పేది ఒకటే దయచేసి హెల్మెట్ ధరించండి నా ఆ ఒక్క నిర్ణయమే ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం అయ్యింది. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు సాయి దుర్గ తేజ్.

ఇవి కూడా చదవండి

సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us