AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సాయి ధరమ్ తేజ్.. కానీ ఈ సినిమా కంటే ముందే పిల్ల నువ్వులేని జీవితం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తేజ్. సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశాడు. ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్స్ అందుకున్నాడు. ఆతర్వాత చిత్రలహరి సినిమాతో తిరిగి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సోలో బ్రతుకే సోబెటర్, విరూపాక్ష సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. చివరిగా మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సినిమా చేశాడు. పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమా చేశాడు తేజ్. మదర్స్ డే సందర్భంగా తన తల్లి పేరును తన పేరుగా మార్చుకున్నాడు తేజ్.. ఇక నుంచి తన పేరు సాయి దుర్గ తేజ్ అని అనౌన్స్ చేశాడు తేజ్.

ఇంకా చదవండి

Cinema: మెగా మేనల్లుడు రిజెక్ట్ చేసిన కథతో శర్వానంద్ సినిమా.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. ఏ మూవీనో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది. ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో వేరే హీరో చేయడం ఇక్కడ పరిపాటిగా జరుగుతుంటుంది. అలా మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ రిజెక్ట్ చేసిన కథకు మరో హీరో శర్వానంద్ ఓకే చెప్పాడు.. కట్ చేస్తే..

Allu Sirish Engagement: అల్లు శిరీష్‌ ఎంగేజ్మెంట్‌కు ఇంత మంది సెలబ్రిటీలు వచ్చారా? మరిన్ని ఫొటోస్ మీకోసం

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం (అక్టోబర్ 31) హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Allu Sirish- Nainika: అలా మొదలైంది.. నయనికతో తన లవ్ స్టోరీని చెప్పేసిన అల్లు శిరీష్

అల్లు వారబ్బాయి, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే నయనిక అనే అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. శుక్రవారం (అక్టోబర్ 31)న అల్లు వారి నివాసం వేదికగా అల్లు శిరీష్- నయనిక ల ఎంగేజ్మెంట్ వేడుక అట్టహాసంగా జరిగింది.

మెగా హీరో కోసం సింగర్‌గా మారిన స్టార్ యాంకర్.. థియేటర్స్‌లో దుమ్మురేపిన పాట

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. తేజ్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. ఆతర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చిత్రలహరి, సోలో బ్రతుకే సోబెటర్, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు తేజ్

Sambarala Yeti Gattu: రాక్షసుడి ఆగమనం..! దుమ్మురేపిన తేజ్ సంబరాల ఏటిగట్టు గ్లింప్స్.

కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆతర్వాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు తేజ్.

Naga Babu: నాగ బాబుతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. చరణ్, వరుణ్ కానే కాదు

సినిమాలతో పాటు ఈ టాలీవుడ్ హీరోకు సామాజిక స్పృహ ఎక్కువ. పేదలు, అనాథలు, వృద్ధులకు తన వంతు సాయం చేస్తుంటాడు. పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటాడు. అలాగే చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటాడు.

హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి..టి-హబ్‌లో ఫాస్ట్ & క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్‌పోలో తేజ్

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ బాగా కష్టపడుతున్నాడు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్యన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడీ మెగా హీరో.

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ బ్లాక్ బస్టర్ ‘రిపబ్లిక్’కు నాలుగేళ్లు పూర్తి.. మెగా మేనల్లుడి సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

నాలుగు సంవత్సరాల క్రితం ‘రిపబ్లిక్’ మూవీ వచ్చి అందరిలోనూ ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. దేవా కట్టా దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీని రాజకీయాలు, అవినీతి, సమాజనంలోని అసమానతల నేపథ్యంలో తెరకెక్కించారు. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. సమాజాన్ని ప్రతిబింబించే భావోద్వేగ చిత్రం

OG Movie Trailer: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. ఓజీ ట్రైలర్ పై మెగా మేనల్లుడు రివ్యూ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న సినిమా ఓజీ. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.

Sai Durgha Tej: ‘ఇప్పుడిది నాకు పునర్జన్మ’.. హైదరాబాద్ పోలీసులకు మెగా మేనల్లుడి విరాళం

సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2021 సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (పేరు మార్చుకున్నాడు). తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. చాలా రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందిన సాయి అభిమానుల ప్రార్థనలతో తిరిగి కోలుకున్నాడు.