PAK vs SL: సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే? పూర్తి లెక్కలు ఇదిగో..
Pakistan Semi Final Qualification Scenario: పాకిస్తాన్ జట్టు మరికొద్దిసేపట్లో చావో రేవో లాంటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సాధారణ గెలుపు కాదు.. భారీ తేడాతో గెలిస్తేనే పాక్ జట్టు సెమీస్ చేరుతుంది. లేదంటే సెమీస్ చేరకుండానే ఇంటికి పోతుంది.

Pakistan Semi Final Qualification Scenario: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించాల్సిందే. అయితే, పాక జట్టుకు సాధారణ విజయం మాత్రం సరిపోదు. నెట్ రన్ రేట్ (NRR) మెరుగుపడేలా గెలవకపోతే, న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌పై గెలిచిన తర్వాత పాకిస్థాన్ ఆశలు మళ్లీ సజీవంగా నిలిచాయి. కొలంబోలో జరిగిన ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి పాలవడంతో గ్రూప్-2 సమీకరణాలు పూర్తిగా మారాయి. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి ఉంటే, పాకిస్థాన్ చివరి మ్యాచ్ గెలిచినా ఉపయోగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పాక్ జట్టుకు ఒక లైఫ్‌లైన్ లభించింది.
గ్రూప్ పరిస్థితి – పాకిస్థాన్‌కు చివరి అవకాశం..
సల్మాన్ ఆఘా నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టుకు ఇప్పుడు ఒకే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అది శ్రీలంకపై భారీ విజయం కోసం తమ 100 శాతం ఇచ్చేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌ను నెట్ రన్ రేట్‌లో వెనక్కి నెట్టాలంటే కేవలం రెండు పాయింట్లు కాదు, భారీ మార్జిన్ అవసరం.
పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే..
103 నుంచి 150 మధ్య స్కోర్ చేస్తే – కనీసం 63 పరుగుల తేడాతో గెలవాలి.
151 నుంచి 198 మధ్య స్కోర్ చేస్తే – కనీసం 64 పరుగుల తేడా అవసరం.
199 నుంచి 246 మధ్య స్కోర్ చేస్తే – కనీసం 65 పరుగుల తేడాతో విజయం కావాలి.
ఈ మార్జిన్‌లతో గెలిస్తేనే పాకిస్థాన్ నెట్ రన్ రేట్ మెరుగుపరచుకుని సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకోగలదు.
పాకిస్థాన్ ఛేజ్ చేస్తే…
లక్ష్యాన్ని ఎంత త్వరగా చేధిస్తుందన్నదే కీలకం:
115-123 లక్ష్యం అయితే – 12.4 ఓవర్లలోపు పూర్తి చేయాలి.
124-132 అయితే – 12.5 ఓవర్లలోపు చేధించాలి.
133-142 అయితే – 12.6 ఓవర్లలోపు చేరాలి.
143-152 అయితే – 13.1 ఓవర్లలోపు పూర్తి చేయాలి.
153-163 అయితే – 13.2 ఓవర్లలోపు గెలవాలి.
164-175 అయితే – 13.3 ఓవర్లలోపు లక్ష్యం చేరాలి.
ఇది కేవలం గెలుపు గురించి కాదు.. నెట్ రన్ కోసం భారీగా, అలాగే ఎంతో వేగంగా టార్గెట్ ఛేదించాల్సి ఉంటుంది.
హై-ప్రెషర్ మ్యాచ్..
శ్రీలంకపై ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు డిసైడింగ్ పోరుగా మారింది. సెమీఫైనల్ రేసు పూర్తిగా నెట్ రన్ రేట్‌పై ఆధారపడి ఉండడంతో ప్రతి ఓవర్, ప్రతి రన్ కీలకం. చిన్న పొరపాటు కూడా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
