AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ హీరో యాక్టింగ్ వల్లే సినిమా ప్లాప్ అయ్యింది.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

దర్శకుడు తాతినేని సత్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వీడెవడు చిత్రం, సచిన్ జోషి శంకర చిత్ర నిర్మాణ అనుభవాలను పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ గొప్ప నిర్మాతగా కీర్తించిన ఆయన, నటుడిగా మాత్రం సచిన్‌కు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదని తెలిపారు. వీడెవడు చిత్ర నిర్మాణ సమయంలో నటుడి ఎంపిక విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, అనుకున్న పర్ఫార్మెన్స్ రాకపోవడం వల్ల అది బ్యాక్‌ఫైర్ అయ్యిందని సత్య వివరించారు.

Tollywood: ఆ హీరో యాక్టింగ్ వల్లే సినిమా ప్లాప్ అయ్యింది.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..
Director Tatineni Satya
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2026 | 4:17 PM

Share

దర్శకుడు తాతినేని సత్య ఓ ఇంటర్వ్యూలో తన చిత్రాలైన వీడెవడు, శంకర నిర్మాణ అనుభవాలు, నటుడు-నిర్మాత సచిన్ జోషి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సచిన్ జోషిని ఒక “అద్భుతమైన నిర్మాత” అని అన్నారు. ఆయనలో లైకా లాంటి పెద్ద నిర్మాణ సంస్థలను నడిపే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అయితే, నటుడిగా మారాలనే సచిన్ జోషి కోరిక వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని తెలిపారు. వీడెవడు చిత్రానికి సంబంధించి, తాము ప్రయత్నించినప్పటికీ, హీరో ఆశించిన స్థాయిలో నటనను పండించలేకపోయారని, ఇది రివ్యూలలో కూడా వెల్లడించారని సత్య వివరించారు. దర్శకుడిగా తాను కోరుకోని హీరోయిన్‌ను సచిన్ జోషి ఎంచుకోవడం వంటి కొన్ని అంశాలు సినిమాకు రివర్స్ గా మారాయని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, సచిన్ జోషి ఒక నిజాయితీ గల వ్యక్తి , గొప్ప నిర్మాత అని, నటనను పక్కన పెట్టి నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తే పెద్ద నిర్మాత అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

తన మరో చిత్రం శంకర గురించి మాట్లాడుతూ, ఈ సినిమా కేవలం మూడు నెలల్లో పూర్తయిందని, ఐదవ నెలలో విడుదల కావాల్సిన చిత్రం మూడేళ్ల తర్వాత విడుదలైందని సత్య ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల ఆలస్యం వల్ల సినిమా మార్కెట్ ట్రెండ్స్‌కు దూరమైందని, పబ్లిసిటీ, ప్రచారం కొనసాగించడం అసాధ్యమైందని ఆయన అన్నారు. ఈ ఆలస్యం నటుడు రోహిత్ కెరీర్‌పై కూడా ప్రభావం చూపిందని, శంకర సమయంలో తాను జాన్ విజయ్‌ను విలన్‌గా పరిచయం చేశానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత జాన్ విజయ్ అనేక చిత్రాలలో నటించారని పేర్కొన్నారు. శంకర ఆలస్యంగా విడుదల కావడానికి ప్రొడ్యూసర్ ఆర్థిక సమస్యలు, రోహిత్ నటించిన కొన్ని చిత్రాల వైఫల్యాలు కారణమని తాతినేని సత్య వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

తెలుగు సినీ పరిశ్రమలో గ్రూపిజం గురించి వస్తున్న వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, బాలేకపోతే చూడరని తాను నమ్ముతానని భీమ్లీ నుండి సతీ లీలావతి వరకు తన నమ్మకం ఇదేనని తాతినేని సత్య చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us