అందరి దృష్టి రష్మిక నగలపైనే.. 10 నెలల శ్రమ.. రాజసం ఉట్టిపడేలా..
Rajitha Chanti
Pic credit - Instagram
27 February 2026
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా విరోష్ జంట ధరించిన రాజసం ఉట్టిపడే నగలపైనే అందరి కళ్లు ఉన్నాయి.
అచ్చం రాజుల కాలం నాటి శైలిని తలపించేలా ఉన్న ఆ ఆభరణాలు కేవలం అలంకరణ మాత్రమే కాదు.. వాటి వెనుక 10 నెలల కష్టం ఉందట.
అలాగే ఒక తల్లి ప్రేమ కూడా దాగి ఉంది. తమ ఇంటికి మహాలక్ష్మిగా వస్తున్న రష్మిక కోసం విజయ్ తల్లి ప్రత్యేకంగా ఆ నగలను చేయించిందట.
తొమ్మిది గజాల ఎరుపు రంగు పట్టుచీరలో బంగారు నగలతో అచ్చం దేవతలా మెరిసిపోయింది రష్మిక. అలాగే విజయ్ సైతం ఆకట్టుకున్నాడు.
రష్మిక ధరించిన ఆభరణాలను రూపొందించడానికి ప్రముఖ శ్రీ జ్యువెల్లర్స్ సంస్థకు దాదాపు 10 నెలల సమయం పట్టిందని సమాచారం.
యాంటిక్ మ్యాట్ ఫినిషింగ్ తో లోతైన నక్షీ పనితనం, సన్నని రవ్వ డిటైలింగ్‌తో కూడిన 11 రకాల ఆభరణాలను తన పెళ్లిలో రష్మిక ధరించింది.
సాంప్రదాయ చోకర్లు, భారీ హారాలు ఆమెకు ఒక రాయల్ లుక్ తీసుకువచ్చాయి. ఈ నగలు మన సంస్కృతికి నిదర్శనంగా నిలిచాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్