Andhra: భక్తులు లాగుతున్న రథం ఒక్కసారిగా నిలిచిపోయింది.. ఈ ఏనుగు ఏం చేసిందంటే..?
అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠంలో జరిగిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మధ్యలో ఆగిపోయిన భారీ రథాన్ని భక్తులు కదిలించలేకపోయినా, మఠానికి చెందిన ఏనుగు చక్రాలను తలతో నెట్టడంతో రథం మళ్లీ ముందుకు కదిలింది. ఈ దృశ్యం భక్తులను ఆహ్లాదపరిచింది.
అనంతపురం జిల్లా ఉరవకొండలోని సుప్రసిద్ధ గవి మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు పాల్గొని శివనామస్మరణతో ప్రాంతమంతా మారుమోగింది. అయితే రథోత్సవం మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారీ రథం సగం దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయింది. భక్తులు ఎంత ప్రయత్నించినా రథం ముందుకు కదల్లేదు. దీంతో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో గవి మఠానికి చెందిన ఏనుగు ముందుకు వచ్చి రథ చక్రాలను తలతో నెమ్మదిగా నెట్టింది. గజరాజు సహాయంతో రథం మళ్లీ కదలడం ప్రారంభించింది. ఒకవైపు భక్తులు ఓం నమశ్శివాయ నినాదాలతో మారుమోగుతుండగా, మరోవైపు ఏనుగు రథాన్ని నెడుతున్న దృశ్యం భక్తులను భక్తి భావంలో ముంచెత్తింది. మధ్యలో ఆగిపోయిన రథం గజరాజు సాయంతో ముందుకు కదలడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరుదైన ఘటన రథోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

