AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gharana Mogudu: ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఘరానా మొగుడు.. ఈ సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అయితే చిరు కెరీర్ మలుపు తిప్పిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ఘరానా మొగుడు ఒకటి. ఈ సినిమా అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Gharana Mogudu: ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఘరానా మొగుడు.. ఈ సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
Gharana Mogudu Movie
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2026 | 3:54 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో దశాబ్దాలుగా అనేక హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. చిరు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఘరానా మొగుడు ఒకటి. చిరంజీవి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సినిమాలో చిరు మ్యానరిజం, స్వాగ్, కామెడీ, మాస్ డైలాగ్స్, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో.. చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో వంటి డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. ఈ చిత్రానికి చిరు రూ.1 కోటి 25 లక్షలు తీసుకున్నారట. అప్పటివరకు సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఎవరూ తీసుకోలేదట.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో హిందీలో అమితాబ్ బచ్చన్ టాప్ పొజీషన్ లో ఉన్నాడు. కానీ ఆ స్థాయిలో పారితోషికం తీసుకోలేదు. కానీ మొదటి సారి కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీ వస్తే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇందులో నగ్మా హీరోయిన్ గా నటించగా.. ఇద్దరి మధ్య వ్చచే సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే చిరు మాస్ ఇమేజ్ మరింత పెరిగింది.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఇదిలా ఉంటే.. ఇటీవల మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరికొన్ని చిత్రాలు సైతం క్యూలో ఉన్నట్లు టాక్.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

Follow Us