AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవునా.. నిజమా.. సంభోగం తరువాత ఆడ అనకొండ మగ పామును ఎందుకు చంపి తినేస్తుంది..?

ఆడ అనకొండలు సంభోగం తర్వాత మగ పాములను మింగేస్తాయి. ఇది వాటికి పోషకాహారాన్ని అందిస్తుంది, ముఖ్యంగా ఏడు నెలల గర్భధారణ సమయంలో. పరిశోధకుల అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ విచిత్రమైన ప్రవర్తన ప్రకృతిలోని సంక్లిష్టతను వెల్లడిస్తుంది. .. ..

Ram Naramaneni
|

Updated on: Mar 22, 2026 | 8:24 AM

Share
పాముల సంభోగం అనే మాట కూడా మనం ఉచ్చరించం..  సయ్యాట అంటుంటాం.. అయితే వివిధ రకాల పాముల జీవనశైలి, వాటి ప్రవర్తన గురించి ఎప్పటికప్పుడు మనుషుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అలానే దక్షిణ అమెరికాలో కనిపించే భారీ ఆకుపచ్చ అనకొండలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా వాటి సంభోగం గురించి.. అవును శాస్త్రవేత్తల పరిశోధనలో.. శృంగారం అనంతరం ఆడపాము మగపామును తినేస్తుందని నివేదికల్లో వెల్లడైంది. ఈ పాములు 29 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరిగి, అనేక వందల పౌండ్ల బరువును కలిగి ఉంటాయి.

1 / 5
అంతేకాదు సంభోగం సమయంలో ఆడపాము పూర్తి డామినేషన్ చూపిస్తుందట. అయితే ఆడ పాము.. మగ పాము కంటే నాలుగైదు రెట్లు పెద్దగా ఉండటంతో.. ఆ కార్యం అనంతరం అది మగపామును తినేస్తుంది. ఇది ఆడపాముకు కావాల్సినంత శక్తిని ఇస్తుంది. ఆడ ఆకుపచ్చ అనకొండలు సాధారణంగా 15 అడుగుల పొడవు వరకు పెరిగి, 70 నుండి 170 పౌండ్ల బరువు ఉంటాయి, కొన్ని అయితే 29 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, మగవి సాధారణంగా 9 నుంచి 14 అడుగుల పొడవు పెరిగి, 30 నుండి 70 పౌండ్ల బరువు ఉంటాయి.

2 / 5
ఇక్కడ మరో ఆసక్తికర విషయం చెప్పాలి. చనువుగా మెలగాలనే కోరిక తొలుత ఆడపాముల్లోనే వ్యక్తమవుతుంది గతంలో చాలా పరిశోధనలు వెల్లడించాయి.  ఆడ అనకొండ కుబుసం విడిచే సమయంలో ఫెరోమోన్స్‌ను రిలీజ్ చేస్తుంది. ఆ వాసన మగ పాములకు తెలిసిపోతుంది. వాటి సాయంతో అవి ఆడ పాము పరిమాణాన్ని తెలుసుకుంటాయి. ఆడ పాము పెద్దగా ఉండడం వల్ల ఎక్కువ గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది. అందుకే మగ పాము పెద్ద ఆడ పాము కనిపించగానే దాని కోసం అన్వేషణ మొదలుపెడుతుంది.

3 / 5
ఆకుపచ్చ అనకొండలకు "బ్రీడింగ్ బాల్" అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సంభోగ పద్ధతి ఉంది. ఈ ప్రక్రియలో, అనేక మగ అనకొండలు, కొన్నిసార్లు 10 నుంచి 15 వరకు, ఒకే ఆడ అనకొండ చుట్టూ చుట్టుకొని, సంభోగించే అవకాశం కోసం పోరాడతాయి. ఆడ అనకొండ మధ్యలో ఉంటుంది. ఈ పోటీ గంటల తరబడి లేదా రోజుల తరబడి కూడా కొనసాగవచ్చు. సాధారణంగా ఒక మగ అనకొండ మాత్రమే గుడ్లను ఫలదీకరణం చేయడంలో విజయం సాధిస్తుంది, కానీ ఇంతమంది పోటీదారులు ఉండటం వలన అత్యంత పోటీతత్వ వాతావరణం ఏర్పడుతుంది. ఈ అధిక ఒత్తిడితో కూడిన వ్యవహారం కూడా ఆడపామును మగపామును తినేయడానికి సంబంధం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు, అయినప్పటికీ దాని కచ్చితమైన కారణాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.

4 / 5
ఆడ అనకొండ సంభోగం తర్వాత మగ పామును మింగేస్తున్న దాఖలాలను శాస్త్రవేత్తలు పక్కాగా ట్రాక్ చేశారు. అయితే అన్నిసార్లు ఇది జరగదు. కొన్నిసార్లు మగ పాములు.. చాకచక్యంగా తప్పించుకుంటాయి. అయితే ఆ ప్రక్రియ వెంటనే.. ఆడపాము, మగపామును తినడానికి ఓ లాజిక్ ఉంది. గర్భం దాల్చిన దాదాపు 7 నెలల వరకు ఆడ పాము ఏమీ ముట్టదు. దీంతో తినేసిన మగపాము దానికి బలవర్ధకమైన ఆహారంగా చాలాకాలం కాపాడుతున్నది ఓ వెర్షన్. మగ పాముతో సంభోగంలో తృప్తి పొందకపోతే ఆడ పాము వెంటనే దాన్ని దగ్గరికి రానివ్వకుండా మరో పాము కోసం ఎదురుచూస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక ఆడ పాము అదే మగ పాముతో రెండోసారి జత కట్టాలని లేదు. ఆడ పాము వేరు వేరు మగ పాములతో శృంగారం చేయడం కనిపిస్తుందట. ఒక మగ పాము చేదోడుగానే ఉన్నప్పటికీ, ఆడది మరొక మగ పాముతో జత కట్టడానికి ఇంట్రస్ట్ చూపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

5 / 5
Follow Us