ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. UIDAI జారీ చేసిన కీలక ప్రకటన ప్రకారం, జూన్ 4వ తేదీ వరకు ఆధార్ అప్డేట్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈ గడువు తర్వాత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా వంటి వివరాలు మార్చుకోవడానికి ఉడాయి వెబ్సైట్ లేదా మై ఆధార్ యాప్ ఉపయోగించి డాక్యుమెంట్లు సమర్పించాలి. వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.