AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

Phani CH
|

Updated on: Apr 23, 2026 | 4:58 PM

Share

నాసిక్‌లోని టీసీఎస్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు, మత మార్పిడికి ఒత్తిడి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు, 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పోలీసులు సిట్ ఏర్పాటు చేయగా, సీఎం ఫడ్నవిస్ దీనిని "కార్పొరేట్ జిహాద్" గా అభివర్ణించారు. టీసీఎస్ అంతర్గత విచారణ ప్రారంభించింది. పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి ఆధారాలు సేకరించారు.

కొత్తగా పెళ్లయిన ఓ మహిళా ఉద్యోగినిపై సహోద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు మత మార్పిడికి ఒత్తిడి చేశారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో నాసిక్ పోలీసులు సిట్‌ ఏర్పాటు చేసి, ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పుణెలో భర్త ఉద్యోగం చేస్తుండటంతో బాధితురాలు నాసిక్‌లో అత్తమామలతో కలిసి ఉంటోంది. ఆమెకు గతేడాది పెళ్లయింది. 2025 జూన్ 20న నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ లో అసోసియేట్‌గా చేరింది. శిక్షణ సమయంలో టీమ్ లీడర్ రజా, ట్రైనింగ్ లీడర్ షారుఖ్ తనను వ్యక్తిగత విషయాలు అడుగుతూ వేధించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. “భర్త దూరంగా ఉంటున్నాడు కదా, ఒంటరిగా ఎలా ఉంటున్నావ్? నీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా?” అంటూ అసభ్యంగా మాట్లాడేవారని ఆరోపించింది. శిక్షణ పూర్తయ్యాక, మరో టీమ్‌లోని ఆసిఫ్ అనే మరో ఉద్యోగి వేధింపులు మొదలుపెట్టాడని ఆమె తెలిపింది. కూర్చునే ఖాళీ లేకపోయినా పక్కనే కూర్చుని ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని తాకడం, చేతులు పట్టుకోవడం, తొడపై, భుజంపై చేయి వేయడం వంటివి చేసేవాడని చెప్పింది. నాసిక్‌ టీసీఎ్‌సలో పనిచేస్తున్న ఎనిమిది మంది మహిళా టెకీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులను కలిసి, ఆరుగురు తోటి ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. తమను వారు లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఆ ఫిర్యాదును నిర్ధారించుకోవడం కోసం పోలీసులు నేరుగా రంగంలోకి దిగారు. నలుగురు మహిళా కానిస్టేబుళ్లు పని మనుషుల వేషంలో అక్కడ చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఉద్యోగుల కదలికలపై కన్నేశారు. ఇమ్రాన్‌ అనే వ్యక్తి ఆ ఉద్యోగులతో వాట్సాప్‌ సంభాషణలు సాగించడం పోలీసుల కంట పడింది. అతడు మలేషియాతో సంబంధం కలిగిన మత ప్రచారకుడు కావచ్చునని అనుమానిస్తున్నారు. విదేశాల్లో జీవితం బాగుంటుందని, మంచి ఉద్యోగ అవకాశాలు.. చక్కని వేతనాలు దొరుకుతాయంటూ వీడియో కాల్స్‌లో వారిని ఇమ్రాన్‌ తెగ ఊరించేవాడు. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఇది “కార్పొరేట్ జిహాద్” అనిపిస్తోందని, చాలా తీవ్రమైన విషయమని సీఎం ఫడ్నవిస్ అన్నారు. మరోవైపు టీసీఎస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసి అంతర్గత విచారణ కోసం ఓ కమిటీని, బయటి సంస్థలను నియమించింది. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

సారీ హేమక్కా.. తప్పు చేశాను.. తమన్నా క్షమాపణ వైరల్ వీడియో

పది రూపాయల స్నాక్‌.. పది కోట్ల వ్యూస్‌

Follow Us