AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna : పొద్దున్నే ఆ ఒక్క జ్యూస్ తాగడం వల్లే.. 66 ఏళ్ల వయసులో నాగార్జున జుట్టు రహస్యం ఇదే..

అక్కినేని నాగార్జున వ్యక్తిగత మేకప్ మ్యాన్ చంద్ర, నాగార్జున ఆరోగ్య రహస్యాలను పంచుకున్నారు. ఆయన ఆహార నియమాలు, వ్యాయామం, జుట్టు సంరక్షణ విధానాలను వివరించారు. నాగార్జున వారంలో ఐదు రోజులు మితంగా మామూలు ఆహారం తీసుకుంటారని, ప్రతిరోజూ ఉదయం ప్రత్యేక జ్యూస్, జిమ్ తప్పనిసరిగా చేస్తారని చంద్ర తెలిపారు.

Rajitha Chanti
|

Updated on: Apr 23, 2026 | 9:49 PM

Share
సినీ పరిశ్రమలో బతికితే అక్కినేని నాగార్జునలాగా బతకాలి అని చాలామంది హీరోలు అంటుంటారు. 66 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగ్. అంతేకాదు.. ఆయన లాంగ్ హెయిర్ స్టైల్ కు ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆయన సంపదను పక్కన పెడితే, నాగార్జున జీవనశైలి, శరీరం నిర్వహణ, ఆహారపు అలవాట్లు ఎంతోమందికి ఆదర్శం. ఈ ఆరోగ్య రహస్యాలను ఆయన వ్యక్తిగత మేకప్ మ్యాన్ చంద్ర ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

1 / 5
నాగార్జున వారంలో ఐదు రోజులు మితంగా సాధారణ ఆహారాన్ని తీసుకుంటారు. అల్పాహారంలో ఒక ఇడ్లీ, వడ లేదా గారె వంటివి మాత్రమే తింటారు. ఆయన ఆకలేసినప్పుడు మాత్రమే తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా బెండకాయ, హాట్ చిప్స్ ఉంటాయి. అన్నం దంపుడు బియ్యంతో వండినది అయి ఉండాలి, అది కూడా మనం తినలేనంత మెత్తగా, ముద్దలాగా ఉండాలని ఆయన ఇష్టపడతారు. రసం, ఒక అరటిపండు కూడా భోజనంలో భాగం. శనివారం రాత్రి నాగార్జునకి పాంప్లెట్ చేపలు చాలా ఇష్టం, ఒకటి లేదా రెండు చేపలు తింటారు. ఈ చేపలను వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఆలివ్ ఆయిల్‌తో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆదివారం రెండు మూడు ముక్కల మటన్ లేదా చికెన్ తీసుకుంటారు.

2 / 5
నాగార్జున ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ చేస్తారు. ఉదయం షూటింగ్‌కు రాగానే ఒక పెద్ద రాగి గ్లాసు నిండా ప్రత్యేక జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తాగుతారు. ఈ జ్యూస్‌లో నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్‌రూట్, పటికబెల్లం లేదా తేనె కలిపి ఇస్తారు. ఇదే ఆయన జుట్టు రాలకపోవడానికి ప్రధాన రహస్యమని చంద్ర తెలిపారు. అన్నమయ్య సినిమా మినహా, నాగార్జున తన కెరీర్‌లో విగ్గులు ఎక్కువగా ఉపయోగించలేదని చంద్ర పేర్కొన్నారు.

3 / 5
నాగార్జున, చంద్ర మధ్య కేవలం హీరో-మేకప్ మ్యాన్ సంబంధం మాత్రమే కాకుండా, మంచి స్నేహం కూడా ఉంది. షూటింగ్‌లలో ఉన్నప్పుడు చంద్ర ఆయన కోసం దోసెలు, ఇష్టమైన చేపలు వండి పెట్టేవారు. వంటపై ఆసక్తి ఉన్న చంద్రకు నాగార్జున దమ్ బిర్యానీ, తందూరి చికెన్ వంటి వంటల తయారీ గురించి కూడా సలహాలు ఇచ్చేవారని చంద్ర గుర్తు చేసుకున్నారు. నాగార్జున ఉన్నచోట తాను, తాను ఉన్నచోట నాగార్జున ఉండేవారని, ఒక నీడలాగా తమ బంధం ఉండేదని చంద్ర చెప్పారు.

4 / 5
చంద్ర తన కార్యాలయంలో నాగార్జున అరుదైన చిత్రాలను భద్రపరిచారు. వీటిలో "రావయ్యి చందమామ" సినిమా షూటింగ్ సమయంలో స్విట్జర్లాండ్‌లో తీసిన యంగ్ నాగార్జున ఫోటో, క్రూజ్ షిప్‌లో తీసిన ఫోటోలు ఉన్నాయి. బ్రహ్మానందం చంద్రకు బహుమతిగా ఇచ్చిన శ్రీనివాసుడి పెయింటింగ్‌ను కూడా ఆయన ప్రేమగా దాచుకున్నారు. నాగార్జున ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే కుబేర, కూలీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

5 / 5
Follow Us