అలా చూడగానే బాధేసింది.. నేను అలా చెప్పలేదు.. సాయి పల్లవి..
Rajitha Chanti
Pic credit - Instagram
23 April 2026
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది.
తన సహజ సిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించింది.
గతంలో సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆమె పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
ముఖ్యంగా ఆమె నటించిన 'అమరన్', బాలీవుడ్ చిత్రం 'రామాయణ' వార్తల్లో నిలిచిన సమయంలో ఈ పాత వీడియోలను మళ్లీ తెరపైకి తెచ్చి వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు.
ఈ ప్రచారంపై సాయి పల్లవి స్పందిస్తూ.. "ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, సందర్భం లేకుండా ప్రచారం చేయడం బాధాకరం. నేను ఎప్పుడూ మానవత్వానికే ప్రాధాన్యత ఇస్తాను.
ఏ వర్గానికో వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నా మాటలను తప్పుగా చిత్రీకరించి నన్ను విమర్శించడం వల్ల నా కుటుంబ సభ్యులు కూడా మానసిక వేదనకు గురవుతున్నారు
తానూ ఒక సామాన్యురాలినేనని, కేవలం సినిమా నటిని అయినంత మాత్రాన తన వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు.
తప్పుడు వార్తలను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని అభిమానులను, నెటిజన్లను కోరారు. సోషల్ మీడియాలో ఆమెకు అండగా నిలుస్తున్నారు.