'పెద్ది' కోసం రామ్ చరణ్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

23 April 2026

Basha Shek

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎప్పటి నుంచో షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ మెగా మూవీ మార్చిలోనే విడుదల కావాల్సింది. కానీ ఏప్రిల్ 30కు వాయిదా పడింది.

ఇప్పుడీ డేట్ కు కూడా పెద్ది సినిమా రావడం లేదు. జూన్ లో ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ లోపు రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ సినిమా కోసం దాదాపు 120 కోట్ల రెమ్యూనరేషన్‌ని రామ్ చరణ్ తీసుకుంటున్నాడట.  ఇది అతని కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పుకోవచ్చు.

 కాగా ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రామ్ చరణ్ పేరు గ్లోబల్‌ స్థాయిలో మార్మోగిపోయింది. ఇప్పుడు అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

కాగా పెద్ది సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి సీనియర్ హీరోలు కూడా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.  

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.