హీరోయిన్ కావాల్సింది.. యాంకర్ అయ్యింది.. పింక్ శారీలో గ్లామరస్ బ్యూటీ

Rajitha Chanti

Pic credit - Instagram

23 April 2026

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లతో బిజీగా ఉంటుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్రెండీ డ్రెస్సులలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరించే ఈ బ్యూటీ తాజాగా గులాబీ రంగు చీరలో ఫోటోషూట్ నిర్వహించారు.

 సాధారణంగా గ్లామర్ డ్రెస్సుల్లో కనిపించే స్రవంతి, ఈసారి సంప్రదాయబద్ధంగా చీరలో మెరిశారు. గులాబీ రంగు పట్టు చీర, దానికి తగ్గట్టుగా స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

ఈ ఫోటోల్లో ఆమె కళ్ళకు కాటుక, అందమైన నగలు ధరించి పక్కా తెలుగు అమ్మాయిలా ముస్తాబయ్యారు. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, అవి కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యాయి.

నెటిజన్లు "పింక్ శారీలో చాలా బాగున్నారు", "అచ్చమైన తెలుగు అందం" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సెలబ్రిటీ ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీ సంపాదించింది.

ఆ తర్వాత బిగ్ బాస్ ఓటిటి (Bigg Boss OTT) లో పాల్గొని మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. తనదైన మాటకారి తనంతో, చమత్కారంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్‌గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కలిగి ఉన్న స్రవంతి రోజూ ఏదోక పోస్ట్ చేస్తుంటారు

ఒకవైపు కెరీర్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు తన ఫిట్‌నెస్‌పై కూడా స్రవంతి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జిమ్ వీడియోలను, వర్కౌట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు స్ఫూర్తినిస్తుంటారు.