AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ హీరోయిన్లకు అదొక్కటే మార్గమా..?

సీనియర్ హీరోయిన్లకు అదొక్కటే మార్గమా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 23, 2026 | 6:44 PM

Share

తెలుగు సినీ సీనియర్ హీరోయిన్లకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే ఏకైక మార్గమా? నయనతార, అనుష్క, సమంత వంటి తారలు కమర్షియల్ సినిమాలకు దూరమై ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. మునుపటి ఫామ్ అందుకోవడానికి, కెరీర్ కొనసాగించడానికి వారికిది తప్ప మరో ఆప్షన్ లేదా? ఈ ధోరణి వెనుక కారణాలు, వారి భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ.

సీనియర్ హీరోయిన్లకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదా..? మునపటి ఫామ్ అందుకోడానికి వీళ్ళ ముందున్న ఏకైక మార్గం ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమేనా..? కమర్షియల్ హీరోయిన్లుగా ఈ సీనియర్ బ్యూటీస్ అంతా చక్రం తిప్పడం అనేది మళ్లీ సాధ్యమేనా..? మన ముద్దుగుమ్మల విషయంలో ఏం జరుగుతుంది..? నయనతారను ఇలా ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌గా చూసి చాలా రోజులైపోయింది.. జవాన్‌లోనూ ఈమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గానే ఉంటుంది కానీ గ్లామర్ వైపు ఉండదు. పైగా రొటీన్ హీరోయిన్స్ పాత్రల కంటే లేడీ ఓరియెంటెడ్ వైపే అడుగులేస్తున్నారు నయన్. ఏడాదికి అరడజన్ చేస్తే.. అందులో ఏ ఒక్కటో అరో హీరోయిన్‌గా కనిపిస్తున్నారీమే. అనుష్క అయితే పూర్తిగా కేరాఫ్ లేడీ ఓరియెంటెడ్ అయిపోయారు. బాహుబలి తర్వాత హీరోయిన్ పాత్రలకే దూరం అయిపోయారు జేజమ్మ. వయసు పెరగడంతో కుర్ర హీరోలకు సెట్ అవ్వకపోవడం.. సీనియర్స్ అందరితోను నటించడంతో.. అనుష్క ముందు ఫీమేల్ సెంట్రిక్ కథలు తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.. ప్రస్తుతం మలయాళంలో కథనార్‌లో నటిస్తున్నారు స్వీటీ. సమంత కూడా కొన్నేళ్లుగా లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగులేస్తున్నారు. ఇప్పుడు కూడా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలాలో మా ఇంటి బంగారం సినిమా చేస్తున్నారు స్యామ్. ఈ సినిమా మే 15న విడుదల కానుంది. ఇక రష్మిక ఓవైపు గాళ్ ఫ్రెండ్, మైసా లాంటి ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ చేస్తూనే మరోవైపు రణబాలి లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

Follow Us