AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: ఫస్ట్ టైమ్ నాని ప్లానింగ్ మిస్.. దానికి కారణం ఎవరు..?

Nani: ఫస్ట్ టైమ్ నాని ప్లానింగ్ మిస్.. దానికి కారణం ఎవరు..?

Phani CH
|

Updated on: Apr 23, 2026 | 6:42 PM

Share

నాని సాధారణంగా పర్ఫెక్ట్ ప్లానింగ్‌కు పేరుగాంచినప్పటికీ, ఆయన 'ప్యారడైజ్' చిత్రం విడుదల ఆలస్యం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. షెడ్యూల్ మార్పులు, పెరిగిన బడ్జెట్ కారణంగా సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతోంది. ఈ ఆలస్యం నాని తదుపరి సుజీత్ సినిమా షూటింగ్‌పైనా ప్రభావం చూపుతోంది. నాణ్యత విషయంలో రాజీపడకూడదనే నాని పట్టుదలే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.

నాని అంటేనే పర్ఫెక్ట్ ప్లానింగ్‌కు నిదర్శనం.. ఆయన ఒక్కసారి షెడ్యూల్ వేసుకుని రంగంలోకి దిగారంటే టార్గెట్ ఎంత పెద్దదైనా ఆన్‌టైమ్ రీచ్ అవ్వాల్సిందే. అలాంటి నాని ప్లానింగ్ ఇప్పుడు గాడి తప్పుతుందా..? లోపం ఈ హీరోలో ఉందా లేదంటే ఈయనతో పని చేస్తున్న దర్శకుడిలో ఉందా..? ప్యారడైజ్ మొదలయ్యాక నాని ప్లానింగ్ ఎందుకు మిస్ ఫైర్ అవుతుంది..? ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ టైమ్ నాని కెరీర్‌లో కాస్త కంగారు కనబడుతుంది.. ఆయన రేంజ్ పెరుగుతున్న మాట నిజమే అయినా చెప్పిన టైమ్‌కు సినిమా రావట్లేదు. ఒక్కసారి డేట్ ఫిక్స్ చేస్తే.. ఆన్ టైమ్ వచ్చేస్తాడని నాని మీద బయ్యర్లకు ఓ కాన్ఫిడెన్స్ ఉంటుంది.. కానీ ప్యారడైజ్ తర్వాత ఫస్ట్ టైమ్ ఆ ప్లాన్ మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. దసరా, హిట్ 3 లాంటి భారీ సినిమాలను కూడా చెప్పినట్లు ఆన్ టైమ్ రిలీజ్ చేసిన నాని.. ప్యారడైజ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త తడబడుతున్నారు. ముందు మార్చి 26న రిలీజ్ అన్నారు కానీ కుదర్లేదు.. ఇప్పుడు ఆగస్ట్ 21 అంటూ డేట్ ఇచ్చారు.. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ తేదీకి కూడా ప్యారడైజ్ రావడం కష్టమే అనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ నెక్ట్స్ సుజీత్ సినిమాపై కూడా పడుతుంది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబో కావడంతో ప్యారడైజ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు చేరిపోయాయి.. పైగా బడ్జెట్ కూడా 150 కోట్లకు చేరింది. దాంతో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు నాని.. లేటైనా పర్‌ఫెక్ట్ కంటెంట్‌తోనే రావాలని చూస్తున్నారు. అందుకే సుజీత్ బ్లడీ రోమియో షూట్ అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగానే మొదలయ్యేలా కనిపిస్తుందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

Follow Us