AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్, నీల్.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

ఎన్టీఆర్, నీల్.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 23, 2026 | 6:38 PM

Share

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీ 2027 జూన్ 11కి వాయిదా పడింది. ఈ వార్త అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ, మేకర్స్ మే 20న సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తారక్ ఫ్యాన్స్ గ్యాప్ గురించి బాధపడినా, గ్లింప్స్ అప్‌డేట్‌తో ఉత్సాహంగా ఉన్నారు. కొత్త పోస్టర్ అంచనాలను పెంచింది.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది.. ఎప్పట్నుంచో ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న వార్త రానే వచ్చింది.. ఆ అప్‌డేట్ చూసి ఆనందపడాలో బాధ పడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్లు. కాకపోతే ఒకటి కాకపోతే మరోటి అన్నట్లు వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఇచ్చారు తారక్. మరి కొత్త సినిమా విషయంలో జూనియర్ ఇచ్చిన అప్‌డేట్ ఏంటి..? జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్స్ కోసం చాలా రోజులుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు అభిమానులు. కానీ టీం మాత్రం సైలెంట్‌గానే ఉంటున్నారు. అదేంటి అంటే.. టైమ్ వచ్చినపుడు చెప్తాం అన్నారు. ఇప్పుడా టైమ్ వచ్చేసింది.. నీల్, ఎన్టీఆర్ సినిమా డేట్ ఫిక్సైంది.. ఏకంగా ఏడాది వాయిదా వేసి జూన్ 11, 2027న డేట్ లాక్ చేసారు మేకర్స్. జూన్ 25, 2026 విడుదల అంటూ గతేడాది తారక్ పుట్టిన రోజుకు అనౌన్స్ చేసారు మేకర్స్. కానీ మధ్యలో చాలా మారిపోయాయి. షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదల తేదీని ఏకంగా ఏడాది పాటు వాయిదా వేయక తప్పలేదు. 2026, జూన్ 25 నుంచి 2027, జూన్ 11కి డేట్ ముందుకు జరిపారు. జూన్ 11, 2027 అని డేట్ చూసేసరికి తారక్ ఫ్యాన్స్ ఒకింత నిరాశలోకి వెళ్లిపోయారు.. ఎందుకంటే మరోసారి తమ హీరోను చూడ్డానికి భారీ గ్యాప్ వచ్చేసింది కాబట్టి. 2024లో దేవరతో వచ్చిన తారక్.. ఆ తర్వాత వార్ 2తో వచ్చినా వాళ్లు దాన్ని డబ్బింగ్ సినిమాగానే చూస్తున్నారు. అంటే మరో స్ట్రెయిట్ సినిమా కోసం మూడేళ్లకు పైగానే వేచి చూడాల్సిందే. రిలీజ్ డేట్ కాస్త లేట్ అయినా.. మే 20న టీజర్ విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. దాంతో పండగ చేసుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్. డేట్ లేట్ అయిందనే విషయాన్ని పూర్తిగా మరిపించేలా.. గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నారు నీల్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ నీడ‌ లాంటి లుక్‌లో క‌నిపిస్తున్నారు. మొత్తానికి కాస్త లేటైనా.. లేటెస్ట్‌గా రంగంలోకి దిగబోతున్నారు జూనియర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

Follow Us