AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

MI vs CSK : ఈ మ్యాచ్‌కు అసలైన హీరో సంజూ శాంసన్. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ, ముంబై బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్‌లో ఇది ఆయనకు ఐదో సెంచరీ కాగా, ఈ సీజన్‌లో రెండోది.

MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
Mi Vs Csk
Rakesh
|

Updated on: Apr 23, 2026 | 11:28 PM

Share

MI vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఎల్ క్లాసికో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో ముంబైని వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి సీఎస్కే ఘనవిజయం సాధించింది. సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదగా, బౌలింగ్‌లో అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ ముంబై బ్యాటింగ్ నడ్డి విరిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇది ఆయన ఐపీఎల్ కెరీర్‌లో ఐదో సెంచరీ కాగా, ఈ సీజన్‌లో రెండోది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది సంజూ తన సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. మిగిలిన బ్యాటర్లలో రుతురాజ్ (22), కార్తీక్ శర్మ (18) పర్వాలేదనిపించారు.

208 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలోనే ఓపెనర్ డానిష్ మలేవార్ డకౌట్ కాగా, కొద్దిసేపటికే క్వింటన్ డికాక్ (7) అవుట్ అయ్యాడు. నమన్ ధీర్ కూడా సున్నాకే వెనుదిరగడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్ (36), తిలక్ వర్మ (37) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. అకీల్ హొస్సేన్ వారిద్దరినీ అవుట్ చేసి ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు.

బౌలింగ్‌లో సీఎస్కే స్పిన్నర్లు అద్భుతం చేశారు. అకీల్ హొస్సేన్ కీలకమైన వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ తన స్పెల్‌లో వరుస బంతుల్లో హార్దిక్ పాండ్యా (1), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (0)లను పడగొట్టి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. చివరికి ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే చాపచుట్టేసింది. అన్షుల్ కంబోజ్ చివరి వికెట్ తీయడంతో ముంబై ఆలౌట్ అయ్యింది. ముంబై బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం ఆ జట్టు దారుణ వైఫల్యానికి నిదర్శనం.

ముంబైపై ముంబైలోనే ఈ స్థాయిలో గెలవడం సీఎస్కే కు పెద్ద బూస్టప్ ఇచ్చింది. సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ధోనీ లేకపోయినా, రోహిత్ లేకపోయినా ఈ ఎల్-క్లాసికోలో సంజూ తన మార్క్ చూపించాడు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో టాప్ 5కి లోకి చేరుకోగా, ముంబైకి ప్లేఆఫ్ దారులు మరింత కష్టతరంగా మారాయి. ముంబై ఫ్యాన్స్ నిశ్శబ్దంగా స్టేడియం వీడగా, పసుపు చొక్కాల ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us