ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లోనే మంచి క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీకి రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఓనర్. రోహిత్ శర్మ నేతృత్వంలో ఈ ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, పియూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా లాంటి ముంబై ప్లేయర్స్.. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియం.. ముంబై ఇండియన్స్ జట్టు హోం గ్రౌండ్. 2017లో, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలలో 100 మిలియన్ల డాలర్లు దాటిన మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది. 2019లో ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ సుమారు 9,809 కోట్లు( అమెరికన్ కరెన్సీలో 115 మిలియన్ల డాలర్లు) అని అంచనా. ఈ ముంబై ఇండియన్స్ జట్టు శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్ధనే హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.