4,4,4,4.. ముంబై వద్దంది.. లక్నో ముద్దంది.. కట్‌చేస్తే.. 22 బంతుల్లో విధ్వంసం
Arjun Tendulkar: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ప్రారంభమైంది. ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతలో, సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు గోవా అర్జున్ టెండూల్కర్‌ను పంపింది. కెప్టెన్ నిర్ణయం తెలివైనదని నిరూపితమైంది.

Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. గోవా జట్టు తరపున ఆడుతున్న అర్జున్, ఉత్తర ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఫోర్ల వర్షం కురిపించాడు. నవంబర్ 26న జరిగిన ఈ మ్యాచ్‌లో గోవా, ఉత్తర ప్రదేశ్ జట్లు తలపడ్డాయి. గోవా జట్టు కెప్టెన్ అర్జున్ టెండూల్కర్‌ను ఓపెనింగ్‌కు పంపగా, ఆ నిర్ణయం సరైనదేనని అర్జున్ నిరూపించాడు.
అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్స్..
ఓపెనర్‌గా వచ్చిన అర్జున్ టెండూల్కర్ 22 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో 4 అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 127.27గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో గోవా తరపున అభినవ్ తేజ్రాణా 35 బంతుల్లో 72 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, అర్జున్ రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
IND vs SA: ఏరికోరి టీమిండియా కోచ్‌గా వచ్చింది ఇందుకేనా గంభీర్.. తొక్కలో స్ట్రాటజీతో కొంపముంచావ్‌గా..
మ్యాచ్ ఫలితం..
మొదట బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ జట్టు, ఆర్యన్ జుయల్ (57 బంతుల్లో 93 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. బౌలింగ్‌లో అర్జున్ టెండూల్కర్ 2.2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు.
ఇదికూడా చదవండి: గంభీర్, అగార్కర్‌ల మూర్ఖత్వానికి నలుగురు బలి.. టీమిండియా నుంచి ఇలా గెంటేశారేంటి..?
ఐపీఎల్ 2025లో లక్నో తరఫున బరిలోకి..
రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ బదులుగా లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నాడు. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి టీమిండియాలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా అర్జున్ బరిలోకి దిగనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








