లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఒక ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటుంది. ఈ జట్టు RPSG గ్రూప్ యాజమాన్యంలో ఉంది. ఇది గతంలో 2016, 2017 మధ్య రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ ఫ్రాంచైజీని కలిగి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్, ఛైర్మన్ సంజీవ్ గోయెంకా, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ యజమాని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినోద్ బిష్త్, మేనేజర్ అవినాష్ వైద్య ఉన్నారు. ఫిబ్రవరి 2022 మెగా వేలంలో ఫ్రాంచైజీ తన మొదటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమ్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ప్రస్తుతం తన పాత టీం కేకేఆర్‌కు తిరిగి వచ్చారు.
2022 సీజన్‌లో, ఫ్రాంచైజీ గ్రూప్ దశలో మూడవ స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాల్గవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. 2023 సీజన్‌లోనూ మూడవ స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయింది.