నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పర్యాటకులను ఆశ్చర్యపరిచే అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఫర్హాబాద్ వ్యూ పాయింట్ వద్ద కుక్కల గుంపును చూసి ఓ చిరుత ప్రాణభయంతో చెట్టెక్కింది. సాధారణంగా కుక్కలు చిరుతలను చూసి భయపడతాయి, కానీ ఇక్కడ కుక్కలు చిరుతను గంటల తరబడి చెట్టుపైనే ఉంచాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది.