13 ఏళ్లుగా కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీష్ రాణాకు కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను ఆపేయాలని ఆదేశించింది. 2018 తర్వాత దేశంలో పరోక్ష కారుణ్య మరణం చట్టబద్ధం అయ్యాక జరిగిన తొలి కేసు ఇది. ఈ తీర్పు జస్టిస్ జేబీ పార్థీవాలా భావోద్వేగానికి గురయ్యారు.