నటి సమీరా రెడ్డి తన ఇటీవల ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలెంట్‌కు బదులు అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ముఖ్యంగా తెల్లతోలు వ్యామోహం తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆమె తెలిపారు. మరింత అందంగా కనిపించేందుకు డైరెక్టర్లు ముఖానికి, శరీరానికి మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేశారని, అది తనను మానసికంగా బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.