AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 13, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. మిథున రాశి వారికి రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 13 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 13, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నెరవేరుస్తారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పై అధికారుల అండదండలు లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధి స్తారు. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల ఒత్తిడిని తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. కొందరు మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. స్వల్ప అనారోగ్యం కూడా బాధిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

మధ్య మధ్య అష్టమ శని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్వల్ప అనారోగ్యాలు, పనుల్లో శ్రమ, తిప్పట, పని ఒత్తిడి వంటివి ఉంటూ ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సాయం చేసే పరిస్థితిలో ఉంటారు. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రులో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా బాగానే గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల కారణంగా ఒక వ్యవహారం సునాయాసంగా పరిష్కారమవుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల లాభం ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు శుభ వార్తలు అందుకుంటారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబసమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. కొందరు స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పని భారం, పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఆదాయ సమస్యలుండకపోవచ్చు. అయితే, ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనుల్లో ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. కుటుంబపరమైన చికాకులు ఉంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

Follow Us