హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఐటీఐ విద్యార్థి ప్రవేష్ శర్మ చిరుతపులితో 12 నిమిషాల పాటు భీకర పోరాటం చేశాడు. తన పొలం నుండి పాలు తెస్తున్న సమయంలో చిరుత దాడి చేయగా, ప్రవేష్ ఆత్మరక్షణ కోసం దాని దవడలను పట్టుకొని ప్రతిఘటించాడు. ఈ పోరాటంలో చిరుత మృతి చెందగా, ప్రవేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.