మట్టి కుండ నీరు వేసవిలో దాహాన్ని తీర్చడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్రిడ్జ్ నీటి వల్ల వచ్చే జలుబును నివారిస్తూ, గొంతు తట్టుకునేంత సహజసిద్ధమైన చల్లదనాన్ని ఇస్తుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీరు ఖనిజ లవణాలను, విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది. ఇది వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.