గ్యాస్ కష్టాలకు చెక్: 60 గంటల్లోనే సిలిండర్ డెలివరీ!
దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తలెత్తిన చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఇకపై గృహ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది.
హార్ముజ్ జలసంధిలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా నిలిచిపోయినప్పటికీ, ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం వేగంగా స్పందించింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ఇతర రూట్ల ద్వారా చమురు దిగుమతులను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అయితే, గ్యాస్ కొరత దృష్ట్యా కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై కఠిన నిబంధనలు విధించింది. కొన్ని రోజుల పాటు హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించడంతో వ్యాపార రంగంపై ప్రభావం పడుతోంది. సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రభుత్వం ‘ఎస్మా’ చట్టాన్ని కూడా అమలు చేస్తోంది. మరోవైపు ధరల సెగ సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 115 చొప్పున కేంద్రం పెంచింది. యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, సరఫరా మెరుగుపడుతుందన్న కేంద్రం ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట లభించినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి
రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..
హైదరాబాద్‌లో విచిత్రం..పిండం పెట్టడం కోసం కాకి కొనుగోలు
సిగరెట్ మానేస్తే.. మీ అకౌంట్ లో లక్షలకు లక్షలు..ఎలాగో తెలుసా?
జాగ్రత్త :వచ్చే 4 రోజులు గండమే.. దంచి కొట్టనున్న వర్షాలు!
అమెరికా పట్టుకున్న ఇరాన్ నౌకతో చైనా గుట్టురట్టు?
సునామీ అలర్ట్! జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

