AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి

Phani CH
|

Updated on: Aug 06, 2026 | 5:19 PM

Share

హైదరాబాద్‌ చందానగర్‌లో లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, రెండు రోజుల క్రితం కర్ణాటకలోని శివమొగ్గలో మరో వృద్ధుడు లిఫ్ట్ షాఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. వరుసగా జరిగిన ఈ ఘటనలు లిఫ్ట్ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హెచ్చరిక బోర్డుల లేమి, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

లిఫ్ట్‌ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. మొన్న కర్నాటకలో.. నిన్న హైదరాబాద్‌లో.. రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. దేవావత్‌ అనసూయ అనే మహిళ భర్తతో కలిసి చందానగర్‌ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లే క్రమంలో అనసూయ.. లిఫ్ట్‌ ఎక్కారు. లోపల అడుగు పెట్టగా.. గేట్లు వేయకుండానే లిఫ్ట్‌ కదిలిపోయింది. దీంతో.. ఆమె కాళ్లు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అపార్ట్‌మెంట్‌ వాసులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అనసూయ ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై చందానగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకుండా లిఫ్ట్‌ ఆపరేటర్‌ వర్క్‌ చేయడం.. లిఫ్ట్‌ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. మరోవైపు.. రెండు రోజుల క్రితం కర్నాటకలోని శివమొగ్గలో లిఫ్ట్‌లో చిక్కుకుని ఓ రిటైర్డ్‌ ఇంజినీర్‌ ప్రాణాలు కోల్పోయారు. కుమారస్వామి అనే వృద్ధుడు.. శివమొగ్గలోని దత్తమందిరంలో దైవ దర్శనానికి వెళ్లారు. అయితే.. లిఫ్ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి దానికి బలయ్యారు. లిఫ్ట్ వచ్చిందని పొరపాటుగా భావించిన కుమారస్వామి.. లిఫ్ట్ షాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. పై నుంచి వస్తున్న లిఫ్ట్‌లో చిక్కుకుపోవడంతో ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది వృద్ధుడిని అతికష్టంమీద బయటకు తీశారు. అయితే.. లిఫ్ట్‌ కింద పడిపోవడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని శివమొగ్గలోని వినోబానగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు. మొత్తంగా.. వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు బిగ్ షాక్..అకౌంట్లు బ్లాక్!

అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!

టాయిలెట్‌ కోసం బ్రేక్‌ ఇవ్వలేదని దారుణ హత్య.. షాకింగ్‌ నిజం చెప్పిన డ్రైవర్‌

ఏపీలో మహిళలకు ఫ్రీగా లక్ష పట్టుచీరలు! ఊరూరూ తిరిగి పంచుతున్న బీజేపీ నేత

Follow Us